పెద్దమందడి : గన్నిబ్యాగులు (Gunny bags ) ఉంటే లారీలు రావు. లారీలు వస్తే గన్ని బ్యాగులు ఉండవు. ఇలా ఉంది కొనుగోలు కేంద్రాల దగ్గర పరిస్థితి. ఆరుగాలం కష్టపడి పండించిన పండించే రైతు గురించి పట్టించుకునే పాపాన ఎవరూ లేరని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని చిన్నమందడి( Chinnamandadi) గ్రామ రైతులు వాపోయారు.
సోమవారం కొనుగోలు కేంద్రం దగ్గర తూకాలు చేయడానికి గని బ్యాగులు లేకపోవడంతో రైతులతో కలసి బీఆర్ఎస్ నాయకులు ( BRS Leaders ) నిరసన వ్యక్తం చేశారు. చిన్నమందడి గ్రామంలో సగానికి పైగా వడ్లు కొనుగోలు కేంద్రాల దగ్గరనే నిలిచిపోయాయని ఆరోపించారు.
ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కొనుగోలు కేంద్రాలకు గన్ని బ్యాగులను, లారీలను పంపించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల కాపరుల సంఘం మాజీ డైరెక్టర్ నాగేంద్ర యాదవ్, కృష్ణారెడ్డి, రామ్‌రెడ్డి, బాలరాజు, శ్రీనివాస్ రెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు.