వనపర్తి టౌన్, జూలై 6 : పాలమూరు ఎన్నారైల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి నార్త్ కరోలైనా రాష్ట్రంలోని షార్లెంట్ నగరంలో వారి కుటుంబ వేడుకల్లో పాల్గొని పాలమూరు ఎన్నారైలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద చూపాలని ఎన్నారైలను కోరారు.
అదేవిధంగా డ ల్లాస్ పర్యటనలో కూడా ఎన్నారైలు మాజీ మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక పరిశ్రమలా భావించి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పంటల దిగుబడిలో దేశంలోనే అగ్రస్థానంలో రాష్ర్టాన్ని నిలిపారని డల్లాస్‌లో ఎన్నారైలు కొనియాడారు. మరోసారి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా కొనసాగాలని ఆకాంక్షించారు. స్వాగతం పలికిన వారిలో ఎన్నారైలు ర ఘువంశీ, కల్యాణ్, రుత్వేశ్, వినిత్ తదితరులు ఉన్నారు.