మలబార్ జ్యువెల్లరీ ప్రారంభం
జిల్లాకేంద్రంలోని షాసాహెబ్గుట్ట రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్, డైమాండ్స్ జ్యువెల్లరీ షోరూంను శనివారం ప్రారంభించారు.
- మహబూబ్‌నగర్‌లో ఎన్నో వసతులు
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్ అర్బన్, డిసెంబర్ 10 : జిల్లాకేంద్రంలోని షాసాహెబ్గుట్ట రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్, డైమాండ్స్ జ్యువెల్లరీ షోరూంను శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథులుగా ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మలబార్ గోల్డ్, డైమాండ్స్ సంస్థ ప్రతినిధి సి రాజ్ హాజరై ప్రారంభించి షోరూంలో ఏ ర్పాటు చేసిన మైన్ డైమాండ్ జ్యువెల్లరీ, ఎరా, ప్రీసియా, ఎథ్నీక్స్, జెమ్‌స్టోన్ ఆభరణాలు, పిల్లల ఆభరణాలను పరిశీలించారు.
మొదటగా కొనుగోలు చేసిన ఇద్ద రు వినియోగదారులకు ఆయన చేతులమీదుగా ఆభరణాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు మహబూబ్‌నగర్ అంటే చి న్న పట్టణమని, సరైన మౌలిక వసతులు ఉండేవి కాదన్నారు. ఇప్పుడు జిల్లా అభివృద్ధిని చూసి మలబార్ లాంటి పెద్ద పెద్ద వ్యాపారసంస్థలు తరలి వస్తున్నాయన్నారు. షాపింగ్ కోసం కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్లేవారు కూడా ఇక్కడే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మన్సిపల్ చైర్మన్ కేసీ నర్సిహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, అడ్వకేట్ ప్రతాప్‌కుమార్, షరీజ్, భాషా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

