భూత్పూర్, అక్టోబర్ 14 : మండలంలోని శేరిపల్లి గ్రామం అన్ని విభాగాల్లో దూసుకుపోతున్నది. 40-50ఏండ్ల కిం దట ఏర్పడిన గ్రామాలతో పోటీ పడుతూ అభివృద్ధిలో ముందడుగు వేస్తుంది. గ్రామంలో ప్రభుత్వం అమలు చే స్తున్న అభివృద్ధి పనులు నర్సరీ, పల్లెప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, శ్మశాన వా టికతోపాటు కొత్త గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం మం జూరు చేసిన రూ.20లక్షల తో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం నిర్మిం చి జిల్లాల్లో రికార్డు సృష్టించింది. అంతేకాకుండా శేరిపల్లి శివారు జాతీయ రహదారి 44 వ రోడ్డు నుంచి హస్నాపూర్ వరకు రూ.2.50కోట్ల తో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది.
గతంలో గ్రామంలో ఎక్కడ చూసిన మురుగునీరుతో దు ర్గంపు వాసనతో పందులు, ఈగలు విచ్చల విడిగా ఉండేవి. ప్రభుత్వ సహకారం, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రత్యేక కృషితో గ్రామంలో దాదాపు రూ.40లక్షలతో సీసీరోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి వ చ్చే బీటీ రోడ్డుకు ఇరు పక్క లా హరితహారంలో నాటిన మొక్కలు గ్రామంలోకి వచ్చేవారికి స్వాగతం పలుకుతున్నట్లుగా పెరిగాయి. గ్రామ పంచాయతీకి ప్రభుత్వం సొంతంగా ట్రాక్టర్‌ను ఇవ్వడంతో గ్రామంలో పారిశుధ్య సిబ్బందికి ఎంతో మేలు చేస్తుంది. సర్పంచ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే గ్రామాన్ని ఎంతగా అభివృద్ధి చెందుతుందో సర్పంచ్ బోల శేఖర్‌ను చూస్తే తెలుస్తుంది.
ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి సాధించాం
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మా గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టినందు వల్లే గ్రామంలో ఇంతలా అభివృద్ధి పనులను చేశాం. సీఎం కేసీఆర్ గ్రా మాల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు కొత్త గ్రామ పంచాయతీ ల అభివృద్ధి బాగా తోడ్పాటు అ య్యింది. అందరి సహకారంతో మా గ్రామం జిల్లా స్థాయి లో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపికైంది.
– బోల శేఖర్, సర్పంచ్, శేరిపల్లి