పాన్గల్, డిసెంబర్15: ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందనే ఆశతో రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కేంద్రాల నిర్వాహకులు తేమ పేరుతో జాప్యం చేస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సింగిల్విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. సన్నరకం ధాన్యానికి 14శాతం, దొడ్డు రకం ధాన్యానికి 17శాతం తేమ ఉంటేనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వారు ఖరాకండిగా చెబుతుండడం తో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుల తరబడి ధాన్యాన్ని ఆరబెడుతూ రాత్రిపగలూ కల్లాల వద్ద జాగరణ చేస్తున్నారు.
ధాన్యం సేకరణకు హమాలీల చార్జీలు, సుత్తి లి ధారం వంటి భారం రైతులపై మో పుతున్నారు. బస్తాకు రూ.20 చొప్పున క్వింటాకు రూ.40 వసూ లు చేస్తున్నారు. ధాన్యానికి ఒకపక్క మద్దతు ధర లభించక ఇబ్బందులు పడుతుంటే ఇలా అదనపు చార్జీల పేరుతో మాకేమి మిగులుతుందని రైతులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా లారీ లోడ్ కు ఐదారు బస్తా లు తరుగు పేరుతో తీసివేస్తున్నారని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.