ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని నిడుగుర్తి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్ధి యన్ భరత్ కుమార్ ( Bharatkumar ) నేషనల్ మీన్స్ కం మెరిట్ ( Merit Scholarship ) స్కాలర్షిప్నకు అర్హత సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ కాంబ్లె అన్నారు. ఎన్ఎంఎంఎస్ కు ఎంపికైన విద్యార్థిని శనివారం జిల్లా సైన్స్ అధికారి భాను ప్రకాష్, జాజాపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని భారతి పాఠశాల ఆవరణలో ఘనంగా సత్కరించారు.
ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్నకు ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు 4 సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ. 12 వేలు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ అందిస్తుందన్నారు. విద్యతోనే ప్రతి ఒక్కరికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదివి లక్ష సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సింహా, ధనుంజయ, ఆంజనేయులు, రఘురామ్, సుజాత, రవికుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.