ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రైతులకు వరాలు కురిపిస్తున్నా యి. దేశానికే ఆదర్శంగా నిలిచే పథకాలను సీఎం కేసీఆర్ అమలుచేస్తూ ద న్నుగా నిలుస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, నిరంతర ఉచిత విద్యుత్, సకాలంలో ఎరువులు, విత్తనాలు, యంత్రలక్ష్మి, భూచేతన, పంటలబీమా.. ఇలా ఎన్నో స్కీంలను ప్రవేశపెట్టారు. రైతువేదికల ద్వారా కర్షకులకు ఏఈవోలు సూ చనలు, సలహాలు ఇస్తున్నారు. ‘భూచేతన’ కింద పొలాల్లోని మట్టి నమూనాలను వ్యవసాయ అధికారులు సేకరించి.. భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగా సూక్ష్మ పోషకాలు వినియోగించేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రియ పంటలు సాగుచేసేలా కర్షకులను ప్రోత్సహిస్తున్నారు.
వనపర్తి రూరల్, జూలై 16 : రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం ద న్నుగా నిలుస్తున్నది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించని సహా య సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది.
సేంద్రియసాగు దిశగా రైతులకు శిక్షణ..
రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీన్ని ప్రోత్సహించేందుకు గ్రామాల్లో రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ, సేంద్రియ ఎరువుల తయారీకి కావాల్సిన సౌకర్యాలను కల్పించింది. అందులో భాగంగా రాయితీపై జీలుగ, పిల్లిపెసర, జను ము వంటి విత్తానాలను అందిస్తున్నది. వీటినే పొలా ల్లో సేంద్రియ ఎరువులుగా వాడి సాగు చేసే పద్ధతులను అధికారులు వివరిస్తున్నారు. సేంద్రి య పద్ధతిలో ఉత్పత్తి అయ్యే ప్రతి గింజ ఆరోగ్యకరమైనది కావడంతో ఈ సాగు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడనున్నది.
భూసారాన్ని పెంచేందుకే ‘భూ చేతన’ఈ పథకంతో పంట సాగుకు ముందు పొలల్లోని మట్టి నమూనాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తారు. లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుతారు. దీనితో అవసరమైన మేరకే ఎరువులు వాడి అతి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందేలా చేయడమే ఈ పథకం లక్ష్యం.
రైతుబంధు, రైతుబీమాతో ఆసరా..
రెండు పంటలకు రెండు విడుతలుగా ఎకరానికి రూ.5వేల చొప్పున మొత్తం రూ.10వేల పెట్టుబడిని రైతుబంధు రూపంలో అందిస్తున్నది. రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో రూ.5లక్షలను నామినీ ఖాతాలో జమ చేస్తున్నది.
విత్తనోత్పత్తితో నాణ్యమైన దిగుబడులు..
వ్యవసాయశాఖ అధికారులు ఎంపిక చేసిన రైతులకు 50 శాతం సబ్సిడీపై విత్తనాలను అందిస్తారు. రైతు సంఘాల ద్వారా పంట సేకరించిన తరువాత వాటిని వ్యవసాయశాఖ అధికారులు శుద్ధి చేయించి అదే గ్రామాల్లోని రైతులకు తక్కువ ధరకు అందిస్తారు.
నూతన టెక్నాలజీతో సాగు..
రైతులకు ఆధునిక యంత్రాలు, యంత్ర పరికరాలు, ఆధునిక సాగు పద్ధతులను పరిచయం చేస్తూ వాటితో సాగు చేయడం వల్ల వచ్చే లాభాలను రైతులకు వివరిస్తారు. ఈ పథకంలో వరి నాటే యం త్రం, డ్రమ్ సీడర్, నీటి సంరక్షణ కోసం చర్యలు ప్రధానమైనవి.
పంటల బీమాతో నష్ట పరిహారం..
అకాల పరిస్థితుల వల్ల వచ్చే పంట నష్టం నుంచి రైతులు కోలుకునేందుకు పంట బీమా పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తారు. పంటలు పూర్తిగా దెబ్బతిని దిగుబడి తక్కువగా వస్తేనే ఈ పథకం వర్తిస్తుంది.
నీటి సమస్యకు ఫాం పండ్లతో చెక్..
జాతీయ గ్రామీణ వాటర్‌షెడ్ పథకం ద్వారా మెట్ట ప్రాంతాల్లోని పొలాలకు నీటిని నిల్వ చేసే గుంతలను ఏర్పాటు చేసి సమస్యను అధిగమించేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీటిని నిల్వచేయడానికి ఇవి అనువుగా ఉంటాయి. వీటిపై రైతులకు అవగాహన కల్పించి వారి పొలాల్లోని వాలు ప్రదేశాల్లో ఈ నీటి గుంతలను ఏర్పాటు చేయిస్తారు.
వ్యవసాయ పనిముట్లు అందించే ‘యంత్రలక్ష్మి’
వ్యవసాయ రంగంలో రైతాంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, యాంత్రీకరణ పనిముట్లతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలను ఆర్జించేందుకు యాంత్రీకరణ లక్ష్మి పథకం ఉపయోగపడుతున్నది. స్ప్రేయర్లు, ట్రాక్టర్లకు వినియోగించే పరికరాలు, పైపులు, మోటర్లు, రోటోవేటర్లు, ఇతర చిన్నపాటి యంత్రాలను ఈ పథకం ద్వారా అందిస్తారు.
పంటపై రుణం పొందే అవకాశం..
రైతులు పండించిన ధాన్యానికి సరైన ధర వచ్చే వరకు నిల్వ ఉంచేందుకు గోదాంలను నిర్మించింది. నిల్వ ఉంచిన ధాన్యం విలువను బట్టి రూ.10వేల నుంచి రూ.2లక్షల వరకు 6 నెలల వరకు వడ్డీ లేని రుణం పొందవచ్చు. నిల్వ చేసిన పంట విలువపై 75శాతం రుణం కూడా పొందవచ్చు.
సద్వినియోగం చేసుకోవాలి..
రైతులు సాగులో నూతన పద్ధతులను అవలంబించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాలను, ట్రాక్టర్లు, తదితర వాటిని అందిస్తున్నాయి. వ్యవసాయశాఖ అధికారుల సూచనలు, సలహాలతో పథకాలపై అవగాహన పెంచుకొని వాటిని వినియోగించుకోవాలి. తద్వారా సాగులో లాభాలు పొందేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రతి క్లస్టర్ పరిధిలో రైతులకు రైతువేదికలను నిర్మించింది. వీటిలో రైతులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన, మార్కెటింగ్, శిక్షణ కార్యక్రమాలు, ఇతర విషయాలను నేరుగా తెలుసుకోవడానికి అవకాశం కలిగింది.
– సుధాకర్‌రెడ్డి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి, వనపర్తి