నాగర్‌కర్నూల్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ నెలాఖరుతో ప్రస్తుత పాలకవర్గాల కాలపరిమితి ముగియనుండగా.. ఫిబ్రవరిలో కొత్తగా ఎ న్నికైన వారు పగ్గాలు చేపట్టాల్సి ఉన్నది. అయితే, కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల నిర్వహణకు వెనుకడుగు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. స్థానికంగా బీఆర్ఎస్ బలీయంగా ఉండడంతోపాటు ఆరు గ్యారెంటీల అమలులో జాప్యం చేసేందుకు కాంగ్రెస్ ఎంపీ ఎన్నికలను సాకుగా చూపుతూ పంచాయతీ ఎన్నికలకు మొగ్గు చూపడం లేదని తెలుస్తున్నది. దీంతో భవిష్యత్తులో పంచాయతీల అభివృద్ధిపై ప్రభావం చూపనున్నది. రాష్ట్రం, దేశం బాగుపడాలంటే గ్రామాల అభివృద్ధితో నే సాధ్యం. దీన్ని సుసాధ్యం చేస్తూ కేసీఆర్ సర్కారు పంచాయతీలకు భారీగా నిధులు విడుదల చేసింది. అలాగే బలీయమైన పాలన చేపట్టేలా చర్యలు తీసుకున్నది. దీంతో గత పదేండ్లల్లో అంచనాలకు మించి డెవలప్మెంట్ జరిగింది. కాగా, 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరగగా.. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్నది.
ఈ క్రమంలో వచ్చే నెలలో కొత్త పాలకవర్గాలు పగ్గాలు చేపట్టాల్సి ఉ న్నది. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే కనీసం రెండు వారాలకుపైగా సమయం పడుతుంది. కానీ, ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవ డం విస్మయపరుస్తున్నది. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి రాగా, వాటి అమలుపై ప్రజలు గంపెడాశలు పెట్టుకొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోగా.. ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతున్నది. క్షేత్ర స్థాయిలో పరిశీలన తర్వాత గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. దీని ప్రకారం గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు తప్పనిసరి కానున్నాయి. అయితే, శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయినా.. స్థానికంగా ఇప్పటికీ బీఆర్ఎస్ బలీయంగానే ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ మద్దతుదారులే విజయం సాధించే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని గుర్తించిన కాంగ్రెస్ ప్రభు త్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎలాంటి కార్యాచరణ రూపొందించడం లేదనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. నాలుగైదు నెలల తర్వాత జరిగే ఎంపీ ఎన్నికలపై దృష్టి సారించిన రేవంత్ ప్రభుత్వం జనవరితో ముగిసే పంచాయతీ ఎన్నికలను మాత్రం పట్టించుకోవడం లేదు. పాలకవర్గాల స్థానంలో ప్రత్యేకాధికారులను ముందుకు తీసుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ ఎన్నికలు జరగకుంటే ఆరు గ్యారెంటీల అమలును కూడా వాయిదా వే యడం ఒక ఎత్తైతే.. అంతకుముందే ప్రత్యేకాధికారుల తో ఏకపక్షంగా ఆరు గ్యారెంటీల లబ్ధిదారులను ఎంపిక చేసి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చన్న మరో ఎత్తుగడలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఎన్నికల సంఘం మాత్రం ముందస్తుగా ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నది. ఇప్పటికే అధికారులు, పోలింగ్ బూత్‌ల గుర్తింపును చేపడుతున్నది. ఆరు గ్యారెంటీల అమలెలా ఉన్నా గడువులోగా పాలకవర్గాల ఎన్నికలు జరగకుంటే గ్రామ పంచాయతీల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడ నున్నది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోగా, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇక ఎండాకాలంలో తాగునీటి కొరత ఎదురుకానున్నది. పారిశు ధ్యం, వీధిలైట్ల నిర్వహణ, మార్చిలో పన్నుల వసూళ్లు ఎవరు చేస్తారన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. పంచాయతీ పాలకవర్గాలు ఉంటేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని ఐదు జిల్లాల్లో 1690కిపైగా పంచాయతీల్లో ఎన్నికలు జరగకుంటే ప్రత్యేకాధికారుల పాలన కిందకు రానున్నాయి.
గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే పంచాయతీ ఎన్నికలు కచ్చితంగా నిర్వహించాలి. ఇప్పటివరకు గ్రామా ల్లో చేపట్టిన పనులకు బి ల్లుల మంజూరు నిలిచిపో గా, కొత్త ప్రభుత్వం రావడంతో అధికారులు పనులు చేపట్టనీయడం లేదు. ఎం డాకాలం సమీపిస్తున్నది. తాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పింది. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలంటే గ్రామ సభల తీర్మానం తప్పనిసరి. ప్రత్యేకాధికారులతో లబ్ధిదారుల ఎంపిక, అభివృద్ధి సరిగ్గా ఉం డదు. గడువులోగా ఎన్నికలు నిర్వహించాలి.
పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుంటే పారిశు ధ్యం, నీటి సమస్య, వీధి బ ల్బులు, పంచాయతీ పన్ను ల వసూళ్లపై ప్రభావం పడుతుంది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్న పంచాయతీ ఎన్నికలు జా ప్యం చేయడం కాంగ్రెస్‌కు ప్రభుత్వానికి సరికాదు. గె లుపోటములతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
పంచాయతీ ఎన్నికల ని ర్వహణపై ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 461 గ్రా మ పంచాయతీలు ఉన్నా యి. ఎన్నికల అధికారులు మాత్రం సిబ్బంది నియామకం, పోలింగ్‌బూత్‌ల గు ర్తింపు వంటి ప్రక్రియను చే పట్టారు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలపై చర్యలు తీసుకుంటాం.