వనపర్తి టౌన్, సెప్టెంబర్ 9 : జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాల, డిగ్రీ కళాశాలల అద్దె బకాయిలు చెల్లించలేదని భ వన యజమానులు సోమవారం ప్రధాన గే టుకు తాళం వేశారు. ఉపాధ్యాయులు, అ ధ్యాపకులను లోపలికి అనుమతించలేదు.
నాగవరం వద్ద ఉన్న అనూస్ ప్రైవేట్ భవనం లో పెద్దమందడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 618 మంది, మహిళా డిగ్రీ కళాశాలలో 400 మందితో నిర్వహిస్తున్నారు. అ యితే, ఎనిమిది నెలలుగా బిల్డింగ్కు అద్దె బ కాయి ఉండడంతో యజమాని ఆగ్రహం వ్య క్తం చేశాడు. హాస్టల్లో విద్యార్థులు ఉండగా గేటు బయట ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉ పాధ్యాయులు నిలిచిపోయారు. చాలాసేపటి తర్వాత అక్కడ పనిచేసే వర్కర్స్ ఉపాధ్యాయులకు కుర్చీలు అందజేశారు.
పాఠశాల భ వనానికి సంబంధించి నెలకు రూ.3 లక్షలు (8 నెలలకు రూ.24 లక్షలు), కళాళాల భవనానికి నెలకు రూ.4,50,601 (8 నెలలకు రూ.36,04,808) చొప్పున బకాయిలు చెల్లించకుంటే గేట్లు తాళం తీసేది లేదని తేల్చిచెప్పాడు. చివరకు ప్రిన్సిపాల్ జోక్యం చేసుకొని సంబంధిత అధికారులతో యజమానిని మాట్లాడించారు. బిల్లులు త్వరగా చెల్లిస్తామ ని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం 12 గంట ల సమయంలో గేటు తెరిచాడు. అప్పటి దా కా విద్యార్థులు బోధనకు దూరమయ్యారు.