వనపర్తి, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ) : వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యులపై జరుగుతున్న ఆగడాలకు నిరసనగా వనపర్తి జిల్లా కేంద్రంలోని దవాఖానలో వైద్యులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ఎంవో శివప్రసాద్ మా ట్లాడుతూ సభ్యసమాజం తలదించుకునేలా కోల్కత్తాలో వైద్యురాలిపై జరిగిన ఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు.
ఈ ఒక్క ఘటనే కా కుండా వివిధ ప్రాంతాల్లోనూ వై ద్యులపై దాడులు జరుగుతున్నాయన్నారు. దవాఖానల్లో పూర్తిస్థాయిలో వై ద్యులు లేకున్నా డబుల్ డ్యూటీ లు వేసుకొని విధులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజలకు ఎ లాంటి అసౌకర్యం కల్గించకూడద న్న ఉద్దేశంతోనే తక్కువమంది డాక్టర్లున్నప్పటికీ చికిత్సలు అందిస్తున్నారన్నారు.
వైద్యవృత్తిని మానవతా దృక్పథంతో చూడాలని, అలాంటి వారిపట్ల మృ గాలకంటే దారుణంగా మనుషులు వ్యవహరించడం అత్యం త ఘోరమని పేర్కొన్నారు. కోల్కత్తాలో జరిగిన ఘటనలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రం గారావు, డాక్టర్లు మనీషా, అరుణ ఉన్నారు.