మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 13 : కుల సంఘాలను గుర్తించి వారికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో నూతనంగా నిర్మిస్తున్న కంఠమహేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో గౌడ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ 2025 సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం కంఠమహేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎనబై ఏండ్ల్లలో ఏ ప్రభుత్వం కూడా కులసంఘాలకు భవనాలు నిర్మించిన చరిత్ర లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికాంలోకి వచ్చాకనే 76కులసంఘాలకు 200 గజాల నుంచి ఐదు ఎకరాల వరకు భూములు కేటాయించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం 40కులాలకు కేటాయించిన స్థలాలు అలాగే ఖాళీగా ఉన్నాయని. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై దృష్టిసారించి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
గౌడ కులస్తులకు ఇచ్చి న భూమిలో ప్రభుత్వం స్కీల్ డెవలప్మెంట్ ఏర్పా టు చేస్తామనడం చాలాబాధకరమన్నారు. జిల్లా అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.300 కోట్ల నిధులు మంజూరు చేస్తే వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. కార్యక్రమంలో గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, ప్రధానకార్యదర్శి రాజయ్యగౌడ్, గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, చంద్రకుమార్‌గౌడ్, సాయిలుగౌడ్, లోకయ్యగౌడ్ తోపాటు గౌడ సంఘం నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.