గద్వాల అర్బన్, ఆగస్టు 14 : పార్టీలో చేరిన నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం మాజీ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్, ఆయన అనుచరులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ గద్వాల రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. అనంతరం నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు గద్వాలలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధం గా కృషి చేస్తామని ప్రకటించారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రంగం జైపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.