గట్టు, సెప్టెంబర్ 8 : చిన్నోనిపల్లివాసుల యోగక్షేమాల బాధ్యత తనదేనని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్ప ష్టం చేశారు. చిన్నోనిపల్లిలో ఆయన ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ తిరుగుజలాలు చేరి న కిందిగేరి ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రా మస్తులు, నిర్వాసితులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టి కి తీసుకొచ్చారు. అనంతరం పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ వర్షాలు రావడంతో చిన్నోనిపల్లిలోకి వరద వచ్చి చేరిందన్నారు. సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని తెలిపారు.
పునరావాస కేంద్రంలో మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని 250 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున షిఫ్టింగ్ చార్జీలను సో మవారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆలూరు పునరావాస కేంద్రం మాదిరి చిన్నోనిపల్లిని కూడా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు రామన్‌గౌడ్, కృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, విజయ్‌కుమార్, దేవేందర్, వీరే శ్, షడ్రిక్, మునిచంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని బోయలగూడెం, లింగాపురం తదితర గ్రామాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి తమకు ముంపు ఉందని కొంతకాలంగా బోయలగూడెం, లింగాపురంతోపాటు పలు గ్రా మాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఎమ్మె ల్యే రిజర్వాయర్ ప్రాంతాన్ని ఆదివారం పరిశీలించారు. ఉన్నతాధికారులు, సంబంధిత శాఖాధికారులతో మాట్లాడారు. రిజర్వాయర్ నుంచి నీరు బయటకు వెళ్లే విధంగా అవసరమైన చర్యలన్నీ తీసుకుని ఏ గ్రామం కూడా ముంపునకు గురికాకుండా చూడాలని ఆదేశించారు.