జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఉలిగేపల్లిలో బోయ మహేష్ (24) అనే యువకుడు అనుమానస్పదంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. బుధవారం రాత్రి పొలం వద్ద నిద్రిస్తున్న యువకుడు ఇంటికి రాకపోవడంతో గురువారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో మృతి చెందినట్లు గుర్తించారు.
యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులుమృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.