మహిళలంటే అబల కాదు..సబలలు అని నిరూపించాలి : జెడ్పీ చైర్ పర్సన్ సరిత
జోగులాంబ గద్వాల : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ మహిళలు అంటే కేవలం వంటింటికే పరిమితమయ్యే అబల కాదు..సబల అని నిరూపించాలని జెడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో 2కే రన్, ఇండోర్ స్టేడియంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మహిళలనుద్దేశించి మాట్లాడారు. మహిళల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక అవకాశాలను కల్పిస్తుందని, ప్రతి మహిళా దీన్ని సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా రాణించాలని పిలుపునిచ్చారు. మహిళా శక్తిని చాటి చెప్పే విధంగా పోలీసు శాఖ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ రోజు మనది, మన శక్తి ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పేలా మహిళలు ముందుకు సాగాలని కోరారు. అనంతరం మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా దవాఖానలో బాలింతలకు కేసిఆర్ కిట్‌ను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్, మిస్ ఆసియా విన్నర్ రష్మీ ఠాగూర్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బీఎస్. కేశవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలు పరిష్కరించండి
ఇక ఏఐ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

