హైదరాబాద్ నుంచి గద్వాల వరకు ఎటు చూసినా పచ్చదనమే..
గతంలో ఇక్కడి కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్న
ఒకప్పుడు కూలీల వలస..ఇప్పుడు పాలమూరుకే వలసలు
ప్రస్తుతం 5మెడికల్ కళాశాలలు
మొండి పట్టుదలతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం
త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తిచేస్తాం..
బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
మహబూబ్‌నగర్, మార్చి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘మొండిపట్టుదలతో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పూర్తి చేసుకున్నామని..వనపర్తి జిల్లా సస్యశ్యామలం అయిందని..హైదరాబాద్ నుంచి గద్వాల దాకా ధాన్యపు రాశులతో కళకళలాడుతున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే హూజపుతునకలా మారుతుందని అభివర్ణించారు. వనపర్తి పర్యటనలో భాగంగా మంగళవారం సీఎం కేసీఆర్ మార్కెట్ యార్డు ప్రారంభించి, ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం నాగవరంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయ సముదాయం, మెడికల్ కళాశాల, కర్నెతండా లిఫ్టు, వేరుశనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి పరిశోధన కేంద్రం, సీఈ కార్యాలయం, టౌన్ హాల్ భవనాలకు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం వనపర్తిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
ఎట్టి పరిస్థితుల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి పాలమూరు జిల్లాను స స్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్ప ష్టం చేశారు. ఉద్యమ సమయంలో పాలమూరు ప్రజ ల కష్టాలు చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నాను అని చె ప్పిన సీఎం.. ఇప్పుడు అదే పాలమూరులో ఎటు చూ సినా పచ్చదనం స్వాగతం పలుకుతుందన్నారు. ఇది చూస్తే చాలా సంతోషంగా ఉందన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం వనపర్తి పట్టణానికి వచ్చిన సీఎం కేసీఆర్ వనపర్తి మార్కెట్ యార్డును ప్రారంభించిన అనంతరం ‘మన ఊరు-మన బస్తీ-మన బడి’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నాగవరంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని, వనపర్తి కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత.. మెడికల్ కళాశాల, కర్నె తండా లిఫ్ట్, వేరుశనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి పరిశోధన కేంద్రం, సీఈ కార్యాలయం, టౌన్ హాల్ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ సందేహాలను నివృత్తి చేసి సాధ్యమైనంత త్వరగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు వజ్రపుతునక అవుతుందన్నారు.
గతంలో కన్నీళ్లు పెట్టుకున్నా..
గతంలో చాలా సార్లు మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చి కండ్లల్లో కన్నీరు పెట్టుకున్నాను. ఏడ్చి ఏడ్చి ప్రజల కండ్లలో ఇంకిపోయిన నీళ్లు, ఎండిపోయిన బోరుబావులు.. ఇవీ ఆనాటి బాధలని గుర్తు చేశా రు. ఎన్నో రకాల బెదిరింపులు, అవమానాలు.. కేసీఆర్ నిన్ను చంపే స్తం అని ఒకరు.. వ్యక్తిగతంగా నన్ను తిట్టినా.. ఓర్పుతో, మీ దీవన తో పనిచేస్తే రాష్ట్రం వచ్చిందని.. కచ్చితంగా ఉద్యమ జెండా పాలన లో ఉంటేనే న్యాయం జరుగుతుందని.. మీరు మాకు అధికారం ఇ చ్చారని సీఎం తెలిపారు. ఒక్కసారి కాదు.. రెండు సార్లు తమను ఆదరించారన్నారు. తెలంగాణ రాకముందు ఆనాడు మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ లేదు. నేడు ఐదు మెడికల్ కాలేజీలు ఇచ్చామన్నారు. ఆనాడు కావాలని పక్షపాత వైఖరితో ఉన్న తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీ దద్దమ్మల్లా ఉంటే.. ఇప్పుడు మొండిపట్టతో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామన్నారు. దీంతో నేడు వనపర్తి జిల్లా సస్యశ్యామలం అయిందన్నా రు.
అద్భుతమైన పంటలతో నేడు పాలమూరు జిల్లా పాలు కారుతుందన్నారు. గద్వాల ఎమ్మెల్యే తండ్రి చనిపోతే పలకరించడానికి హైదరాబాద్ నుంచి గద్వాల వరకు తాను బస్సులో వెళ్లానని.., ఆ సమయంలో హైదరాబాద్ నుంచి గద్వాల వరకు ధాన్యపు రాశులే కనిపించాన్నారు. ఎక్కడ చూసినా భూములు పచ్చగా ఉన్నాయని సీఎం అన్నారు. వనపర్తి జిల్లా అయితదని ఎవ్వరూ ఊహించలేదని, కానీ, తెలంగాణ ఏర్పాటుతో మన కండ్ల ముందే అన్నీ కనిపిస్తున్నాయన్నారు. దీన్ని సుసాధ్యం చేసుకున్నందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. దళిత బిడ్డల కోసం ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా.. రూ.10 లక్షలు ఇస్తున్నామని.. తిరిగి ఇ చ్చేది లేదు, కిస్తీ కట్టేది లేదు, బ్యాంక్ లింకేజ్ లేదని, వడ్డీ కట్టే బాధే లేదని, వాళ్లకు నచ్చిన పని.. వచ్చిన పని చేసుకొని అద్భుతంగా ముం దుకుపోవాలన్నారు. తెలంగాణ తెచ్చుకొని ఎలాగైతే మనం కరెంట్, తాగునీరు తెచ్చుకున్నమో.. మన దళిత బిడ్డలు కూడా అలాగే బా గుపడాలన్నారు. నిరంజన్‌రెడ్డి నా మిత్రుడు అయినందుకు గర్వ ప డుతున్నానన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు నిరుద్యోగులకు శుభవార్త చెప్తామని సీఎం ప్రకటనతో యువత హర్షం వ్యక్తం చేశారు. దేశ్‌కీ నేత.. సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువును తట్టుకోలేక అన్నదాతలు వలసలు వెళ్తుంటే విలపించిన కరువు నేల.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రూపురేఖలు మారిందో సీఎం కేసీఆర్ పాట పాడి వినిపించారు. స్వయంగా తానే రాసిన ఈ పాట నాటి పాలమూరు దుస్థితికి.. నేటి మార్పునకు అద్ధం పడుతున్నది.
వలసలతో వలవల విలపించిన కరువు జిల్లా..పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తిచేసి ..చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి..పాలమూరు తల్లి పచ్చని పైట కప్పుకొన్నది…
సీఎం పర్యటన సైడ్‌లైట్స్
మంగళవారం మధ్యాహ్నం 12:39 గంటలకు వనపర్తి మండలం చిట్యాల గ్రామంలో నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రారంభం.
1:15 గంటలకు ‘మన ఊరు -మనబడి’ పైలాన్ ఆవిష్కరణ.
1:35 గంటలకు రాజపేట శివారులోని టీఆర్ఎస్ భవన్ ప్రారంభం.
2 గంటలకు వనపర్తి సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభం. జిల్లా అధికారులతో సమీక్ష.
సాయంత్రం 4:48 గంటలకు వేరుశనగ వ్యవసాయ పరిశోధన కేంద్రం, నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీరింగ్ కార్యాలయం, కర్నెతండా ఎత్తిపోతల, ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం నిర్మాణాలకు శంకుస్థాపన.
4:58 నుంచి 5:24 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగం.