స్టేట్ మీడియా అక్రెడిటేషన్ కమిటీ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ల మంజూరు ప్రక్రియలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025 ప్రకారం ఈ కమిటీ పనిచేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ల మంజూరు ప్రక్రియలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025 ప్రకారం ఈ కమిటీ పనిచేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిటీలో ప్రభుత్వం, వివిధ జర్నలిస్టు సంఘా ల ప్రతినిధులకు చోటు కల్పించారు. కమిటీకి రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. కో-చైర్మన్‌గా సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఉంటారు.
జర్నలిస్టు సంఘాల ప్రతినిధుల నుంచి తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే హెచ్-9), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (హెచ్-143), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీజేఏ)ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వివిధ పత్రికలు, వీడి యో జర్నలిస్ట్ ప్రతినిధి, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ప్రతినిధి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా సభ్యుడు, టీజీఆర్టీసీ ప్రతినిధి, దక్షిణ మధ్య రైల్వే ప్రతినిధి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఐ అండ్ పీఆర్ శాఖ జేడీ ఈ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

