కేటీదొడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

కేటీదొడ్డి: కొత్త మండలంగా ఏర్పడినప్పటి నుంచి కేటీదొడ్డి మండలంను అనేక రకాలుగా అభివృద్ధి చేస్తు వస్తున్నాం. ప్రభు త్వ కార్యాలయాలకు అద్దె భవనం నుంచి సొంత భవనాలు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కేటీదొడ్డి మండలంలో గురు వారం రూ.31లక్షలతో నూతనంగా నిర్మించిన మండల వనరుల భవనం (ఎంఆర్సీ)ని స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇదివరకే వ్యవసాయ కార్యాలయాన్ని అద్దె భవనం నుంచి సొంత భవనంలోకి మార్చామని ఇప్పుడు ఎంఆర్సీని మార్చుతున్నామన్నారు. భవిష్యత్తులో తాసీల్దార్, మండల ప్రజా పరిషత్ కార్యాయా లకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా సమయంలో రాష్ట్రంలో గుడ్డు కాలం ఏర్పాడిందని అందు వల్లనే పలు అభివృద్ధి పనులు ఆలస్యం అయ్యాయన్నారు.
లాక్డౌన్ పడటంతో అనేక ఇబ్బందులు పడిన రాష్ట్ర ప్రజలను కంటికిరేప్పలా కాపాడిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులేస్తుందన్నారు. మండలంలో వంద శాతం కరోనా వ్యాక్సిన్ పూర్తి

అయ్యేలా ప్రజలు సహకరించాలన్నారు. భవిష్యత్తులో మండల అభివృద్ధికి నావంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం లభ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కేటీదొడ్డి, గట్టు ఎంపీపీలు మనోరమ, విజయ్ కుమార్, జడ్పీటీసీ రాజశేఖర్, వైఎస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి అధికారులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

