ఉండవెల్లి: ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహయ నిధి వరమని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. శనివారం అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన వివిధ మండలాల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహయ నిధి చెక్కుల ను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా అలంపూర్ మండలంలో ముగ్గురికి (88వేలు), అయిజ మండలంలో 11మందికి (4లక్షల 26వేలు), మానవపాడు మండలంలో 8మందికి (రెండు లక్షల 62వేల 500), ఇటిక్యాల మండలంలో 7గురికి (మూడు లక్షల 65వేలు), ఉండవెల్లి మండ లంలో ఇద్దరికి (47వేలు), రాజోలి మండలంలో 6గురికి (లక్షా 62వేలు), వడ్డేపల్లి మండలంలో ముగ్గురికి (లక్షా 26వేల రూపాయల) చెక్కులను అందజేశామన్నారు.