అలంపూర్, మే 30: జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా కోదండపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కర్నూలు వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ సాంకేతిక లోపంతో కోదండపురం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై నిలిచిపోయింది. వెనుక నుంచి వచ్చిన కారు.. లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వెంకట బాబ్జి సతీమణి శ్రావణి, కూతురు సాయి చరిత్ర అక్కడికక్కడే మృతిచెందారు. వెంకట్ బాబ్జి, పెద్ద కూతురు లక్ష్మీ శాస్త్రలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నేషనల్ హైవే అంబులెన్స్‌లో ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. బాధితులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సమాచారం సేకరిస్తున్నారు.