టీఆర్ఎస్ కార్యకర్తలపైకి రాళ్లతో పరుగెత్తిన మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట, ఫిబ్రవరి 7 : అచ్చంపేటలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. రా జ్యాంగాన్ని అవమానించారని నిరసిస్తూ సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పా ర్టీ పిలుపునిచ్చింది. అప్పటికే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున చేరుకొని విలేకరులతో మాట్లాడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీకృ ష్ణ తన అనుచరులతో క్యాంపు కార్యాలయం వద్దకు రా గానే పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి జీపులో ఎక్కించారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులను తో సుకొని క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి గేటులోపలకి జెండాలను వేశారు. కార్యాలయం లోపల ఉన్న టీ ఆర్ఎస్ శ్రేణులు జెండాలు బయటకు పడేశారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కార్యాలయం లోపల ఉన్న టీఆర్ఎస్ నాయకులు గోడదూకి, గేటు నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. వంశీకృష్ణ పోలీసుల వాహనం దిగి చేతిలో రాయి పట్టుకొని క్యాంపు కార్యాలయం వైపునకు టీఆర్ఎస్ శ్రేణులపైకి దూసుకురాగా పోలీసులు అడ్డుకున్నా రు. రాయి లాక్కొని వంశీకృష్ణను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాడిలో కానిస్టేబుల్, కొందరు నాయకులకు గాయాలయ్యాయి. ముట్టడికి వచ్చిన వారందరి ని పోలీసులు జీపులో ఎక్కించుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.