మహబూబ్ నగర్ మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికలప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని సాక్షాత్తు ప్రధాని మోదీ హామీ ఇచ్చి మోసం చేశారని.. ఇప్పుడు పాదయాత్ర పేరిట షో చేస్తున్న బండి ‘పాలమూరు’కు జాతీయ హోదాపై మాట్లాడరెందుకని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు.
పాదయాత్ర పేరిట మహబూబ్‌నగర్ జిల్లా లో పర్యటిస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజ య్ పిచ్చికుక్కలా మాట్లాడి మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తూ అభంశుభం తెలియని యువతను రెచ్చగొట్టి తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో హన్వాడ మండలంలోని ఇబ్రహీంబాగ్, మునిమోక్షం, దాచేపల్లి గ్రామాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన 600మంది నేతలు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరా రు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాగు, తాగు నీరు ఇవ్వకపోయినా, అభివృద్ధి పనులు చేయకపోయినా మతం పేరిట చిచ్చుపెట్టి యువతను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలవాలనే కుయుక్తులు పన్నడం తప్పా బీజేపీ నేతలకు మరొకటి చేతకాదన్నారు. దేశవ్యాప్తంగా వి ద్యుత్‌ను ప్రైవే టు పరం చేసి రైతుల నడ్డి విరిచేందుకు సిద్ధమయ్యారని మంత్రి ఆరోపించారు. బీసీ ప్రధానమంత్రి ఉన్నా బీసీల కోసం ఓ శాఖను ఏర్పాటు చేయలేని చేతగాని ప్రభుత్వమని బీజేపీపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడక ముందు ఉదయం 3, రాత్రి 3 గంటల కరెంటు మాత్రమే ఇచ్చేవారని, అందులోనూ కో తలు, లో ఓల్టేజీ కారణంగా పంటలు ఎండిపోయి రైతులు అప్పుల పాలయ్యేవారన్నారు. ఆ సమయంలో కూలి దొరకని పరిస్థితితో పనిలేక ఇతర ఊళ్లకు వెళ్లి బతుకుదెరువు చూసుకునే వాళ్లని గుర్తు చేశారు. ఇప్పుడు సాగునీరు, రైతుబంధు, రైతుబీమా, 24గంటల కరెంటుతో రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రి వివరించారు.
ఒకప్పుడు టీ తాగితేనే తాగునీళ్లిచ్చేవాళ్లు..
ఒకప్పుడు మహబూబ్‌నగర్‌లో ఏదైనా హోటల్‌కు వెళ్లి నీళ్లు తాగుదామన్నా యజమాని ఇచ్చేందుకు ఒప్పుకొనే పరిస్థితి ఉండేది కాదని, టీ తాగుతామంటేనే నీళ్లిచ్చేవారని మంత్రి సమైక్య రాష్ట్రంలో ని పరిస్థితులను గుర్తుచేశారు. అప్పటి నీటి ఇబ్బందులకు తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టిందన్నారు. మిషన్‌భగీరథ ద్వారా దేశంలో ఎక్కడా లేని విధం గా ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇందుకోసం పైసా కేటాయించని కేంద్రం, బీజేపీ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి పచ్చిఅబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఆరునూరైనా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉదండాపూర్, కరివెన రిజర్వాయర్ల ద్వారా చెరువులన్నీ నింపుతామని తెలిపారు. హన్వాడ సమీపంలో ఫుడ్‌పార్కు పూర్తి చేసి పరిశ్రమలను తీసుకువస్తామని తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చూస్తామని మంత్రి తెలిపారు.
ఆడబిడ్డల పెండ్లి భారం కాకూడదనే..
మహబూబ్‌నగర్, మే 6 : ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు ఏమాత్రం భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అర్బన్ మండలంలో 600మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద మంజూరైన రూ.6.60 కోట్ల విలువగల చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రా వు, అదనపు కలెక్టర్ కే సీతారామారావు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, డీసీసీబీ అధ్యక్షుడు నిజాంపాషా, ఉపాధ్యక్షుడు కొరమోని వెంకటయ్య, ము న్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహ్మద్‌అబ్దుల్ రహమాన్‌తోపాటు పలు వార్డుల కౌన్సిలర్లు పా ల్గొన్నారు.