- హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ వెంకటేశ్వర్లు
నవాబ్‌పేట, డిసెంబర్ 23 : మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని గురుకుంటకు ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు వెంకట్రాంరెడ్డి ఇటీవల మృతి చెందారు. ఎంపీ కుటుంబసభ్యులను పరామర్శించేందుకుగానూ ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుంటకు విచ్చేస్తున్నారు. ఈ మేరకు సీఎంవో నుంచి ఆదేశాలు రావడంతో జిల్లా ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ మహేశ్, ఆర్డీవో అనిల్‌కుమార్, ఆర్అండ్బీ అధికారులు గురుకుంట గ్రామశివారులో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. హెలిప్యాడ్‌కు అనువైన స్థలాన్ని గుర్తించి పనులు ప్రారంభించారు. అనంతరం హెలిప్యాడ్ నుంచి ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి ఇంటివరకు ఉన్న రోడ్డును టీటీడీ బోర్డు సభ్యుడు జీవన్‌రెడ్డితో కలిసి ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి, సీఐ రాజేశ్వర్‌గౌడ్, నాయకులు ప్రతాప్, గాండ్ల రవి, శ్రీను, పురుషోత్తం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి కేసీఆర్ హెలిక్యాప్టర్‌లో గురుకుంటకు చేరుకుంటారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.