RSP Wife Lakshmi Bai | లక్ష్మీబాయికి అప్రాధాన్య పోస్ట్.. కాంగ్రెస్ అవినీతిపై ఆర్ఎస్పీ పోరాటంతో ఆకస్మిక బదిలీ!
RSP Wife Lakshmi Bai | మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పా ర్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై తన గొంతుక వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆయన భార్య లక్ష్మీబాయిని ప్రభుత్వం అప్రాధాన్య శాఖకు బదిలీచేయడం చర్చనీయాంశంగా మారింది.
RSP Wife Lakshmi Bai | హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పా ర్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై తన గొంతుక వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆయన భార్య లక్ష్మీబాయిని ప్రభుత్వం అప్రాధాన్య శాఖకు బదిలీచేయడం చర్చనీయాంశంగా మారింది. వివాదరహితురాలిగా పేరొందిన లక్ష్మీబాయి ని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ స్థాయి నుంచి ప్ర భుత్వం బదిలీ చేసింది. అప్రాధాన్యమైన తెలంగాణ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ (టీజీ హౌస్‌ఫెడ్) ఎండీగా ని యమించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
ఆమెను ఉన్నపళంగా బదిలీ చేయడంపై మార్కెటింగ్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. కాగా లక్ష్మీబాయి బదిలీ అంశం వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావుకు కూడా తెలియదని సమాచారం. ముఖ్యనేత ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు బదిలీ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. స్వతహాగా మార్కెటింగ్ శాఖ ఉద్యోగి అయిన లక్ష్మీబాయి సుమారు ఏడేండ్లపాటు సంస్థ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. తన భర్త ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజకీయాల్లోకి వెళ్లినప్పటికీ ఆ ప్రభావం శాఖపై, తన విధులపై లేకుండా చూసుకున్నారనే అభిప్రాయాన్ని మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు వ్యక్తంచేస్తున్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం ఆమెకు కీలకమైన పనులు అప్పగించేవారని తెలిసింది. అలాంటిది ఉన్నపళంగా బదిలీ చేయడంపై మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు సైతం అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఆమె బదిలీ వెనుక రాజకీయ కారణం, కక్ష సాధింపు చర్య ఉన్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఆమె భర్తీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సర్కార్ అవినీతిపై పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై ఉన్న కోపాన్ని ఆయన భార్యపై చూపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తద్వారా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

