టెండర్లు వద్దు.. ఆర్డర్లు మాకే ఇవ్వండి.. సీఎస్‌కు తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లేఖ
రాష్ట్రంలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు కావాల్సిన సూల్ బ్యాగులు, షూ, సాక్స్, టై, బెల్టుల సరఫరా ఆర్డర్లను టెండర్లు లేకుండా నేరుగా తమకే కేటాయించాలని తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్(టీజీఎల్ఐపీసీ-లిడ్ క్యాప్) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు కావాల్సిన సూల్ బ్యాగులు, షూ, సాక్స్, టై, బెల్టుల సరఫరా ఆర్డర్లను టెండర్లు లేకుండా నేరుగా తమకే కేటాయించాలని తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్(టీజీఎల్ఐపీసీ-లిడ్ క్యాప్) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు లిడ్‌క్యాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఏడాది ఏప్రిల్ 16న షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్ల, ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖల మంత్రులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీఈసీ శాఖ కార్యదర్శితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వేర్వేరుగా లేఖలు రాశారు.
‘ప్రభుత్వం గతంలో జారీచేసిన జీవో ఆర్టీ నంబర్ 110 ప్రకారం.. సంక్షేమ గురుకులాలు, విద్యాశాఖ, పోలీస్ శాఖతోపాటు అన్ని ప్రభుత్వరంగ సంస్థలు తమకు కావాల్సిన సూల్ బ్యాగులు, షూస్ వంటి వస్తువులను లిడ్‌క్యాప్ నుంచే కొనుగోలు చేయాల్సి ఉన్నది. అయితే, ఇటీవల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ సూల్ వస్తువుల సరఫరా కోసం ఈ-టెండర్ నోటీసు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియను పకన పెట్టి, నేరుగా మాకే ఆర్డర్లు ఇవ్వాలి.
గతంలో బీసీ సంక్షేమ గురుకులాలు, మైనారిటీ సంక్షేమ సంస్థలు, ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు దాదాపు రూ.58.65 కోట్ల విలువైన సూల్ వస్తువులను అత్యంత నాణ్యతతో సరఫరా చేశాం. ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) తో లు కార్మికులు, ఉపాధి లేని దళిత యువత కు శిక్షణ ఇచ్చి మా సంస్థ ద్వారా ఉపాధి కల్పిస్తున్నాం. కాబట్టి 2026-27 విద్యాసంవత్సరానికి గాను వస్తువుల సరఫరా బాధ్యతను మాకే అప్పగించాలి’ అని ఆయ న విజ్ఞప్తి చేశారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా గుజరాత్ కంపెనీకి విద్యార్థులకు కావాల్సిన వస్తువుల టెండర్లను అప్పగించింది. దీనిపై లిడ్‌క్యాప్ హైకోర్టుకు వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. హైకోర్టు ఆదేశంతో లిడ్క్యాప్నకు 10 ఆర్డర్లు ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

