కూలీ పనులు చేసుకునేవారు ఒ కచోటు నుంచి ఇంకోచోటుకు వెళ్లాలంటే ఆటోలు, జీపులు, బొలెరో వంటి ప్రైవేటు వాహనాల్లో వెళ్తుంటారు. కూలీ పని చేసుకోవడమే కాదు మనిషికి భద్రత కూడా ముఖ్యమేనని, ఇలాంటి ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేటపుడు సేఫ్టీ కూడా చూసుకోవాలని సూచించారు. డబ్బుల కోసం కక్కుర్తిపడి స్థాయికి మంచి వాహనాల్లో జనాలను తరస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వాహన డ్రైవర్లను ధరూర్ మండలం ఎస్ఐ కొండా శ్రీహరి హెచ్చరించారు.
డబ్బేకాదు, ప్రజల ప్రాణాలు కూడా మఖ్యమేనని ఆన్నారు. మితిమీరిన వేగంతో వాహనం నడపటం, బండిలో జంతువులను కుక్కినట్టు మనుషులను కుక్కితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బండి లైసెన్న్ తోపాటు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసి కేసులు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఓవర్లోడ్తో బండ్లను అడ్డదిడ్డంగా నడిపితే జరిగే ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా కొంచె ఆలోచించి వాహనాల్లో ఎక్కాలని, బండి ఫుల్లైనా కూడా డబ్బుల ఆశకు డ్రైవర్లు ఎక్కమంటే ఎక్కకూడదని సూచించారు.