గద్వాల, మార్చి10 : తమ ధాన్యం కొనుగోలు చేసి మూడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం మా ఖాతాల్లో బోనస్ జమచేయకుండా కాలయాపన చే స్తుందని, దీంతో తమకు రైతు భరోసాలేక, బోనస్ రాక ఇబ్బందులు పడుతున్నామని వెంటనే బోనస్ చెల్లించాలంటూ సోమవారం అయిజ మం డలం బైనపల్లికి చెందిన సుమారు 50మంది రైతు లు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య రైతులతో కలిసి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కుర్వ పల్లయ్య మాట్లాడుతూ రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రూ.500బోనస్ ఇస్తామని చెప్పి మూడు నెలలు కావస్తున్నా రైతుల ఖాతాల్లో ప్రభు త్వం బోనస్ జమచేయకుండా రైతులను మోసం చేస్తున్నదని ఆరోపించారు. రే వంత్రెడ్డి సర్కారు అసత్య ప్రచారంతో గద్దెనెక్కి కొనుగోలు సెంటర్ల ద్వారా రైతుల నుం చి కొనుగోలు చేసిన ధాన్యానికి తక్షణమే బోనస్ చెల్లిస్తామని మాయమాటలు చెప్పి ఇప్పటి వరకు చెల్లించకుండా రైతులను నట్టే ట ముంచారన్నారు.
రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ వారితో కన్నీరు పెట్టిస్తున్న సర్కా రు ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ సర్కారే అన్నారు. వెంటనే రైతుల ఖాతాల్లో బోనస్ జమచేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అయిజ మండలంలోని బైనపల్లి, రాజపురం, పులికల్, చిన్నతాండ్రపాడు రైతులు నూర్పాషా, నవాజ్, మహబూబ్అలీ, చంద్రశేఖర్రెడ్డి, చక్రవర్ధన్రెడ్డి, ఉరుకుందు, మౌలాళి, ఆంజనేయులు, మల్లేశ్, ఆలంపాషా, మైబు, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.