వస్తున్నాం లింగమయ్యా.. అంటూ భక్తులు అడవి బాట పట్టారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం జాతర శుక్రవారం ప్రారంభమైంది. రెండేండ్ల తర్వాత జాతర జరుగుతుండడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. కొండా.. కోనల వెంట.. రాళ్లు రప్పల మధ్య భక్తులు కాలినడకన సాహస యాత్ర చేపట్టారు. లింగమయ్య నామస్మరణ మార్మోగగా నల్లమల పులకించింది. జలపాతం, గుండంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించాక గంటల తరబడి బారులుదీరి పరమశివుడిని దర్శించుకున్నారు.
లింగాల, ఏప్రిల్ 15 : తెలంగాణ అమర్నాథ్ యా త్రగా పిలువబడే నల్లమలలోని సలేశ్వరం జాతర ప్రా రంభమైంది. మూడ్రోజుల పాటు కొనసాగే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజైన శుక్రవారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఏటా చైత్ర పౌర్ణమికి ముందు, తర్వాత ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరిగేవి.. కానీ ఈ సారి మూడ్రోజుల పాటే అటవీ శాఖాధికారులు అనుమతులు ఇవ్వడంతో భక్తులు ఉరుకులు.. పరుగుల మీద పుణ్యక్షేత్రానికి కాలినడకన చేరుకుంటున్నారు. వ స్తున్నాం లింగమయ్యా.. నామస్మరణ మార్మోగింది. కొ విడ్ కారణంగా రెండేండ్ల తర్వాత నల్లమల కొండలు భక్తుల సందడితో పులకించాయి. ఆర్టీసీ సంస్థ వివిధ డిపోల నుంచి బస్సులను నడిపిస్తున్నది. రెండు మార్గా ల మీదుగా సలేశ్వరానికి భక్తులు చేరుకుంటున్నారు. శ్రీ శైలం-హైదరాబాద్ మార్గంలో పరహాబాద్ రోడ్డు మా ర్గంలో రాంపూర్ చెంచు పెంట వరకు వాహనాలలో చే రుకొని అక్కడి నుంచి ప్రమాదకర మార్గంలో కాలినడకన స్వామి దర్శనానికి చేరుకున్నారు. అదే విధంగా లిం గాల మీదుగా అప్పాయిపల్లి మార్గం నుంచి గిరిజన గూ డెంల వరకు వాహనాలలో వెళ్లి అక్కడినుంచి సుమారు 8 కి.మీ. కాలినడకన భక్తులు వెళ్తున్నారు.
రెండు కొం డల మధ్య నుంచి జాలువారుతున్న జలపాతం, సమీపంలోని గుండంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. భక్తులు పోటెత్తడడంతో ద ర్శనం కోసం గంటల తరబడి బారులుదీరారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు స్వామి నామస్మరణతో యాత్ర చేపట్టారు. భక్తుల కోసం స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం, తాగునీటి వసతి కల్పించా రు. వైద్య, ఆరోగ్య శాఖ వారు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అ యితే గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక మొత్తంలో ఈసారి అటవీ శాఖాధికారులు ఎంట్రీ ఫీజులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని భక్తులు వాపోయారు. వివిధ మార్గాలలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.