నారాయణపేట టౌన్, ఆగస్టు 14 : ప్రజల్లో దేశభక్తి పెరుగాలని వీహెచ్పీ నగర అధ్యక్షుడు నర్సింహులు అన్నా రు. శనివారం వీహెచ్పీ ఆధ్వర్యంలో అఖండ భారత్ దివస్ను ఘనంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కొన్ని వందల ఏండ్లుగా భారతదేశం నుంచి ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బర్మా, నేపాల్ పాకిస్తాన్ విడిపోయాయని తెలిపారు. ‘దేహం ముక్కలై నా దేశం ముక్కలు కానివ్వం’ ప్రతిజ్ఞకు ప్రతిఒక్క రూ పూనుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందిస్తూ ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, గురువుల పై ఉందన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి లింగం రాములు, నాయకులు, బజరంగ్దళ్ స భ్యులు తదితరులు పాల్గొన్నారు.