CMR Paddy seeds | గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండల పరిధిలోని నందిన్నె గ్రామంలో ఉన్న కిమిడి స్వామి రైస్ మిల్లు కేసు వ్యవహారం జిల్లాలో సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. ప్రభుత్వం కేటాయించిన వడ్ల(సీఎంఆర్)ను అమ్ముకున్న కేసులో నిర్వాహకుడు కోర్టును అశ్రయించినట్లు తెలిసింది. తనకు కేటాయించిన సీఎంఆర్ వడ్లు పూర్తి స్థాయిలో బియ్యం ఆడించి ప్రభుత్వానికి ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని ఫిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం.
మిల్లు నిర్వాహకుడు కోర్టును ఆశ్రయించిన విషయం జిల్లా అధికారులకు తెలియడంతో ఈ విషయంపై తీవ్ర స్థాయిలో చర్చించుకుంటున్నట్లు తెలిసింది. అయితే మిల్లు నిర్వాహకుడు తన మిల్లుకు కేటాయించిన వడ్ల వ్యవహారంలో ఓ ప్రభుత్వ అధికారి మోసం చేశాడని తన సహచర మిల్లు నిర్వాహకులతో పెదవి విరిచినట్లు తెలుస్తోంది. వడ్లు దించుకునే సమయంలో వానకు తడిసిన ధాన్యంతోపాటు బాగాలేని ధాన్యం అంటగట్టి అంతా నేను చూసుకుంటా అని చెప్పి తీరా చేతులు ఎత్తేయడంపై తీవ్ర స్థాయిలో ఆవేదన చెందుతున్నట్లు పుకార్లు వినబడుతున్నాయి.
ఇదేం కొత్త ట్విస్ట్ అంటూ..
సదరు అధికారి చేసిన మోసం అంతా ఇంతా కాదని మిల్లు నిర్వాహకులతో చర్చించినట్టు తెలిసింది. అధికారుల తీరుపై మిల్లు నిర్వాహకుడు సవాలు చేస్తూ తనకు కేటాయించిన వడ్లు అందుకు తగ్గట్టు బియ్యం పట్టి ఇవ్వడానికి తనకు అవకాశం ఇవ్వాలని కోర్టును అశ్రయించిన నేపథ్యంలో వస్తుందనే ధీమాలో మిల్లు యజమాని ఉన్నట్లు సమాచారం.
కాగా మిల్లు నిర్వాహకుడు కోర్టును అశ్రయించి మళ్లీ బియ్యం పెట్టడమేంటి.. ఇదేం కొత్త ట్విస్ట్ అంటూ జిల్లాలోని రైస్ మిల్లు నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు చర్చించుకుంటున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే కోర్టు ఆర్డర్ సోమ లేదా మంగళవారం వస్తే అసలు ఈ విషయం బయట పడే అవకాశం ఉంది. ఈ విషయంపై డీఎస్వో స్వామి కుమార్ను వివరణ కోరగా స్పందించలేదు.
Bhoodan Pochampally : పింఛన్లు పెంచాలని భూదాన్ పోచంపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
man shot wife dead | మరో వ్యక్తి బర్త్ డే పార్టీలో భార్య.. వీడియో చూసి కాల్చి చంపిన భర్త
SIR | ‘సర్’ చెల్లుబాటుపై అక్టోబర్ 7న తుది వాదనలు వింటాం : సుప్రీంకోర్టు