తిమ్మాజిపేట, మే 6 : మన గతిని మార్చేది తరగతి గదులేనని, తరగతి గదే మనకు విజ్ఞానం అం దించే మహా గని అని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. అం దుకే సీఎం కేసీఆర్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి రూ.7500 కోట్లతో ‘మన ఊరు- మనబడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శుక్రవారం తిమ్మాజిపేట సీపీఎస్‌లో మన ఊరు – మనబడి కార్యక్రమాన్ని జెడ్పీ చైర్ పర్సన్ పద్మావతితో కలి సి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మొదటగా వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఇచ్చిందని, ప్ర స్తుతం విద్య, వైద్యరంగానికి చేయూతనిస్తున్నందని చెప్పారు.
గతంలో రాష్ట్రంలో మూడు వైద్య కళాశాలలు ఉంటే, నేడు కేంద్రం సహాయం చేయకున్నా వాటిని 33కు పెంచుకున్నామన్నారు. రూ. 650 కోట్లతో నాగర్‌కర్నూల్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ‘మన ఊరు- మనబడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో 16 రకాల వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాల్లో దాతలెవరైనా ఉంటే ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. తనసొంత గ్రామం నేరళ్లపల్లిలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతు ల బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు ఎమ్మె ల్యే ప్రకటించారు. కార్యక్రమంలో డీఈవో గోవిందరాజులు, ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, సర్పంచ్ వేణుగోపాల్‌గౌడ్, ఎస్సీ,ఎస్టీ మానిటరింగ్ సభ్యు డు జోగు ప్రదీప్, తాసిల్దార్ సరస్వతి, ఇన్చార్జి ఎంపీడీవో బ్రహ్మచారి, ఎంపీటీసీ లీలావతి, మా ర్కెట్ డైరెక్టర్లు హుస్సేని, కవిత, ఎంఈవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.