వనపర్తి, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగా ణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వన్నీ తొండి మాటలే అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. జోగుళాంబ అమ్మవారి సాక్షిగా అబద్ధాలు చె ప్పడం మానుకోవాలని బండి, కిషన్‌రెడ్డికి మంత్రి హి తవు పలికారు. శుక్రవారం బీజేపీ నేతలకు ఆయన ఎ న్నో ప్రశ్నలు సంధించారు. 2014 పాలమూరు ఎన్నిక ల ప్రచార సభలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని మోదీ స్వయంగా చెప్పిన మాట నిజం కాదా..? ఇదే ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం సొంతంగా చేపట్టిందా లేదా..? ఈ ప్రాజెక్టుకు కనీసం పావులా కూడా ఇయ్యలేదు సరికదా.. కనీసం జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ బీజేపీ నేతలు నోరు తెరిచి అడిగిన పాపాన పోలేదన్నారు. ఇదేనా మీకు ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఉన్న ప్రేమ ? అన్నారు. నడిగడ్డకు, ఉమ్మడి జిల్లాకు నష్టం కలిగించే కర్ణాటకలోని అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన కేంద్రం తెలంగాణలోని పాలమూరు లిఫ్ట్‌కు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో బండి, కిషన్‌రెడ్డి ఎందు కు నోరు మెదపడం లేదని నిలదీశారు.
ఏడేండ్లుగా కృ ష్ణానదిలో నీటి వాటాలు తేల్చకపోవడమే మీ గొప్పతనమా..? కృష్ణానది వాటర్ మేనేజ్మెంట్ బోర్డు పేరుతో కుట్రలు చేస్తున్నది నిజం కాదా..? తెలంగాణ నీటి వనరులను గుప్పిట పట్టాలని భావిస్తున్న మాట నిజం కాదా? అని ప్ర శ్నించారు. తెలంగాణలో యాసంగిలో పండే బాయిల్డ్, రా రైస్ ప్రతి గింజ కొ నిపించే బాధ్యత నాది అని కిషన్‌రెడ్డి చెప్పింది నిజం కాదా? వడ్ల కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఏం సం బంధం, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది అని.. వరిసాగు చేయాలని బం డి సంజయ్ చెప్పింది నిజం కాదా..? ఆ తర్వాత రా రైస్, బాయిల్డ్‌రైస్ పేరుతో రాజకీయం చేసి.. సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచేందుకు మే మే కొంటామని ప్రకటించాక.. ఈ ఘనత తమదేనని చెప్పుకుంటున్న బీజేపీ నాయకులకు సిగ్గు లేదా అ న్నారు. మీరు ఈ ప్రాంత ప్రతినిధులా…? ప్రజలను వంచించే అధికారం, హక్కు ఎవరిచ్చారని బీజేపీ నేతలను ఘాటుగా ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాకు చేసిన ఒక్క మేలు ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. దక్షిణ దేశంలోనే ఐ దో శక్తిపీఠంగా ఉన్న అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయం పురావస్తుశాఖ పరిధిలో ఉన్నందున ఆలయాభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేకపోతున్నదని మంత్రి పే ర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి రూ.500 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చే దమ్ముం దా? అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 1200 కోట్లు పెట్టి యాదాద్రిని పునర్నిర్మించినట్లు చేయగలరా అని..? ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జోగుళాంబ బ రాజ్‌కు ఎటువంటి ఆటంకాలు లేకుండా కేంద్రం నుంచి అనుమతులు తీసుకురాగలరా..? అ న్నారు. మాచర్ల-గద్వాల రైల్వేలైన్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించేలా చేస్తామని చెప్పే ధైర్యముంటే మందుకురావాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్ విసిరారు. ముందు ఈ ప్రశ్నలన్నింటికీ బీజేపీ నాయకులు సమాధానాలు చెప్పిన తర్వాతే పాదయాత్ర చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టి కాలం వెళ్లదీసి తప్పుడు పనులు మానుకోవాలని సూచించారు.