గద్వాల, సెప్టెంబర్ 15 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈ ఏడాది నుంచే నర్సింగ్ తరగతులు ప్రా రంభం కానున్నాయని రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ డాక్టర్ కేటీ శీబా తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స ర్కార్ దవాఖానను ఇన్స్పెక్టర్ రాష్ట్ర నర్సింగ్ కళాశాలల కౌన్సెలింగ్ ఆర్.జ్యోతితో కలిసి సందర్శించారు. దవాఖానలోని వసతులపై సూపరింటెండెంట్ కిశోర్‌తో మాట్లాడారు. వార్డుల్లో తిరిగి రోగులను పలకరించారు. కాన్పు అయిన వారికి కేసీఆర్ కిట్, గర్భిణులకు పౌష్టికాహారం అందుతుందా లేదా అని ఆరా తీశారు. అంతకుముందు వారికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నర్సింగ్ కా లేజీ ప్రారంభానికి గానూ తాత్కాలిక భవనాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా శీబా మాట్లాడుతూ మొదటి సంవత్సరంలో ఎటువంటి ప్రవేశ పరీక్షలు లేకుండా ఇంటర్ బైపీసీ పాస్ అయిన విద్యార్థులు నేరుగా బీఎస్సీ నర్సింగ్కు అడ్మిషన్లు పొందొచ్చన్నారు. కాలేజీ ప్రిన్సిపాల్‌గా కమల, లెక్చరర్‌గా సత్యప్రియ బాధ్యతలు చేపట్టారన్నారు. అలాగే సిబ్బంది నియామకానికి సంబంధించి అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ధరూర్ మండల కేంద్రంలోని దవాఖానను సందర్శిం చి, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యాయామ గౌరవ అధ్యక్షుడు బీఎస్ ఆనంద్, ప్రైవేట్ విద్యా సంస్థల అధ్యక్షుడు బీచుపల్లి, ప్రదీప్, బాబు నాయుడు, పాల్ సుధాకర్, వెంకటేశ్వర్రావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.