Toxic gas leak | నైజీరియాలోని ఓ గనిలో విషవాయువు లీక్.. 37 మంది దుర్మరణం..
Toxic gas leak | నార్త్ సెంట్రల్ నైజీరియా (N igeria) లోని ఓ గని (Mine) లో విషవాయువులు (Toxic gases) లీకయ్యాయి. ఈ విషవాయువులు పీల్చి 37 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 26 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుందని అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు.
Toxic gas leak : నార్త్ సెంట్రల్ నైజీరియా (N igeria) లోని ఓ గని (Mine) లో విషవాయువులు (Toxic gases) లీకయ్యాయి. ఈ విషవాయువులు పీల్చి 37 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 26 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుందని అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు.
గనిలో ఆకస్మికంగా లెడ్ ఆక్సైడ్, సల్ఫర్, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్‌లు లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ గ్యాస్‌లు మానవాలికి చాలా విషపూరితమైనవని, ముఖ్యంగా తక్కువ వెంటిలేషన్ ఉన్న ఏరియాల్లో వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
నైజీరియా సర్కారు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. మృతదేహాలను అంతిమ సంస్కారాల కోసం కుటుంబసభ్యులకు అప్పగించింది. గనిలో విష వాయువులు లీకవుతాయనే విషయంలో ముందుగానే అవగాహన లేకపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అక్కడి మంత్రి చెప్పారు.
ప్రమాదానికి కారణమైన గని సక్రమమైనదా, అక్రమమైనదా అనే కోణంలో కూడా దర్యాప్తులో తేలుతుందని నైజీరియా మంత్రి తెలిపారు. నైజీరియాలో బంగారం కోసం పలు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఈ గనుల్లో ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

