దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 8 : టీఆర్ఎస్ నూతన కమిటీల సభ్యులు క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టపర్చాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి సూచించారు. బుధవా రం చిన్నచింతకుంట, చిన్న వడ్డెమాన్ గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. చిన్నచింతకుంట గ్రామ అధ్యక్షుడిగా వెంకటేశ్, యూత్ అధ్యక్షుడిగా సమీర్, చిన్నవడ్డెమాన్ గ్రామ అధ్యక్షుడిగా చిన్న సాయిలు, యూత్ అధ్యక్షుడిగా సురేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమం లో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరీరాము, సింగిల్‌విండో చైర్మన్ సురేందర్‌రెడ్డి, సర్పంచ్ మోహన్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట రాము, మండల ఇన్చార్జీలు మహదేవ్గౌడ్, హనుమాన్‌రావు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
మండలంలోని గోపన్‌పల్లి, గుడిబండ గ్రామాల్లో మండ ల ఇన్చార్జి, జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గోపన్‌పల్లి గ్రామ అధ్యక్షుడిగా బోయ కృష్ణ, యూత్ అధ్యక్షుడిగా వడ్డె ప్రసాద్, గుడిబండ గ్రామ అధ్యక్షుడిగా ఆంజనేయులు, యూత్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ తదితరులను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, సర్పంచ్ కోట్ల రజిత, నాయకులు శ్రీకాంత్‌యాదవ్, కొండా శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, శ్రీకాంత్, భాస్కర్‌రెడ్డి, వెంకట్రాములు పాల్గొన్నారు.
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
భూత్పూర్, సెప్టెంబర్ 8 : టీఆర్ఎస్కు కార్యకర్తలే పట్టుగొమ్మలని మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్ అన్నా రు. మున్సిపాలిటీలోని 1, 2 వార్డుల్లో టీఆర్ఎస్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఒకటోవార్డు అధ్యక్షుడిగా నర్సింహులు, ఉపాధ్యక్షులుగా నార్యానాయక్, గోవింద్, ప్రధాన కార్యదర్శిగా రవి, యూత్ అధ్యక్షుడిగా లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా మ ల్లేశ్, మహేశ్, సంతోష్, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్, రెం డోవార్డు అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా రా మాంజనేయులు, గణేశ్, ప్రధాన కార్యదర్శిగా రెడ్యానాయ క్, యూత్ అధ్యక్షుడిగా శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా జానకీరామ్, రాజు, ప్రధాన కార్యదర్శిగా రఘునాయక్ తదితరులను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ క మిటీ వైస్ చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, కౌన్సిలర్లు వ సంత, బాలకోటి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహగౌడ్, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, మాజీ ఎంపీపీలు సత్తూర్ చంద్రశేఖర్‌గౌడ్, చంద్రమౌళి, నాయకులు సాయి లు, సత్యనారాయణ, అశోక్‌గౌడ్, రమేశ్, రవి పాల్గొన్నారు.
మరింత బలోపేతం చేయాలి
గండీడ్, సెప్టెంబర్ 8 : కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. మండలంలోని పగిడ్యాల్, పన్సూర్పల్లి, కొండాపూర్, సల్కర్‌పేట, రంగారెడ్డిపల్లి, వెన్నాచేడ్, రెడ్డిపల్లి తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు సలీం, సర్పంచ్ రాణి, గోపాల్‌రెడ్డి, రాజ్‌కుమార్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, ఉప్పరి గోపాల్, పెంట్యానాయక్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమన్వయంతో ముందుకు సాగాలి
బాలానగర్, సెప్టెంబర్ 8 : గ్రామాల్లో టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కర్ణం శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండలంలోని చిన్నరేవల్లి, తిరుమలగిరి గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. చిన్నరేవల్లి గ్రామ అధ్యక్షుడిగా రాజు, ఉపాధ్యక్షుడిగా రమేశ్, కార్యదర్శిగా చంద్రయ్య, కోశాధికారిగా బిక్షమయ్య, యూత్ అధ్యక్షుడిగా సాంబశివ, ఉపాధ్యక్షుడిగా శ్రీశైలం, కార్యదర్శిగా అనిల్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుండేడ్ చెన్నారెడ్డి, యూత్ వింగ్ మండల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్, ఏఎంసీ డైరెక్టర్ మల్లేశ్, సర్పంచులు కేస్లీ, లక్ష్మీచంద్రమౌళి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మణ్‌నాయక్, రామస్వామి, రాజు పాల్గొన్నారు.
పనిచేసే వారికే గుర్తింపు
నవాబ్‌పేట, సెప్టెంబర్ 8 : టీఆర్ఎస్లో పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు ఉంటుందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు, సింగిల్‌విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు అన్నారు. మండలంలోని యన్మన్గండ్ల, చెన్నారెడ్డిపల్లి, ఇప్పటూర్, కారూర్ గ్రామాల్లో బుధవారం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యన్మన్గండ్ల గ్రామ అధ్యక్షుడిగా చెలిమె శేఖర్, ప్రధాన కార్యదర్శిగా జుర్కి వెంకటయ్య, యూత్ అధ్యక్షుడిగా జుర్కి మహేందర్, ప్రధా న కార్యదర్శిగా సురేశ్‌కుమార్, చెన్నారెడ్డిపల్లి అధ్యక్షుడిగా మల్లేశ్‌యాదవ్, ప్రధాన కార్యదర్శిగా కేశవులు, యూత్ అధ్యక్షుడిగా రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్, ఇప్పటూ ర్ అధ్యక్షుడిగా తెలుగు స్వామి, ప్రధాన కార్యదర్శిగా నర్సింహారెడ్డి, యువత అధ్యక్షుడిగా భరత్, ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్, కూరూర్ అధ్యక్షుడిగా వెంకటయ్య, ప్రధాన కార్యదర్శిగా చెన్నయ్య, యూత్ అధ్యక్షుడిగా వెంకటేశ్, ప్రధాన కార్యదర్శిగా రవికుమార్ తదితరులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, నవాబ్‌పేట ఎంపీటీసీ రాధాకృష్ణ, మా జీ ఎంపీపీ శీనయ్య, యూత్ అధ్యక్షుడు మెండె శ్రీను, ప్రతా ప్, పాశం కృష్ణయ్య, కృష్ణగౌడ్, సర్పంచులు జయమ్మహన్మంతు, యాదయ్య, గౌసియాఅబ్దుల్లా, లక్ష్మారెడ్డి, కారూర్ రైతుబంధు సమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నవనీతరావు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
మూసాపేట, సెప్టెంబర్ 8 : రాష్ర్టాభివృద్ధే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ అన్నారు. బుధవారం మండలంలోని మహ్మదుస్సేన్‌పల్లి, నిజాలాపూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జి సత్యనారాయణ, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ నిర్మలాకాశీనాథ్, గూపని కొండయ్య, శివరాములు, అజ్జుభాయ్, మల్లన్న, చంద్రశేఖర్, రవీందర్‌గౌడ్, రాజు, బుచ్చన్నగౌడ్, ఆంజనేయులు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల, సెప్టెంబర్ 8 : మండలంలోని నసరుల్లాబాద్ టీఆర్ఎస్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా బొక్క కేశవులు, ఉపాధ్యక్షుడిగా శంకరయ్య, కార్యదర్శిగా ఆంజనేయులు, యూత్ అధ్యక్షుడిగా చాకలి కురుమూర్తి తదితరులను ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ జంగయ్య, చర్లపల్లి సర్పంచ్ శ్రీను, ఇమ్మూ, శ్రీకాంత్ పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, సెప్టెంబర్ 8 : మండలంలోని చిల్వేర్, వస్పుల్ గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. చిల్వేర్ గ్రామ అధ్యక్షుడిగా శంకరయ్యగౌడ్, ఉపాధ్యక్షుడిగా వెంకటస్వామి, యూత్ అధ్యక్షుడిగా అశోక్, వస్పుల్ గ్రామాధ్యక్షుడిగా భాస్కర్, ఉపాధ్యక్షుడిగా శేఖర్, యూత్ అధ్యక్షుడిగా శ్రీశైలంను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, సుధాబాల్రెడ్డి, శ్రీనివాసులుగుప్తా, బాలు, జైపాల్‌రెడ్డి, వెంకట్‌సాగర్, సుకుమార్, నవీనాచారి, భీంరాజు, సురేందర్‌గౌడ్, నాగరాజుగౌడ్, రాజమల్లయ్య, వీరేశ్, వెంకటయ్యగౌడ్, పవన్, ఆంజనేయులు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, సెప్టెంబర్ 8 : మండలంలోని నాయినోనిపల్లి, ఎనమిదితండా, వేపూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, సర్పంచులు చిన్నచెన్నయ్య, సత్యమ్మ, సింగిల్‌విండో చైర్మన్ వెంకటయ్య, వైస్‌చైర్మన్ కృష్ణయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజుయాదవ్, నాయకులు కొండా బాలయ్య, రమణారెడ్డి, యాదయ్య, నరేందర్, కృష్ణయ్యగౌడ్, యాదయ్య, ఖాజాగౌడ్, ఆనంద్ పాల్గొన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, సెప్టెంబర్ 8 : మండలకేంద్రమైన మహ్మదాబాద్, అన్నారెడ్డిపల్లి గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహ్మదాబాద్ గ్రామాధ్యక్షుడిగా మామిళ్ల కేశవులు, ఉపాధ్యక్షుడిగా శ్రీను, కార్యదర్శిగా అజీజ్ హుస్సే న్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టీఆర్ఎస్ నా యకులు తెలిపారు. అలాగే అన్నారెడ్డిపల్లి గ్రామాధ్యక్షుడిగా కొర్ర లోక్యానాయక్, ఉపాధ్యక్షుడిగా సభావత్ రాజు, యూ త్ అధ్యక్షుడిగా విస్లావత్ ప్రతాప్, ఉపాధ్యక్షుడి సంతోష్ తదితరులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, ఎంపీటీసీ చెన్నయ్య, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, సాబేర్, రాజశేఖర్‌గౌడ్, ఆంజనేయులుగౌడ్, సత్య య్య, సర్పంచ్ భామినీబాయి. సురేశ్‌నాయక్, సూర్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.