మహబూబ్‌నగర్/మహబూబ్‌నగర్ రూరల్, సెప్టెం బర్ 8 : తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రా ష్ట్రంలో నీలివిప్లవం కొనసాగుతున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మత్స్యకారు లు అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో సర్కారు ఉచితం గా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నదన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరు గ్రామంలోని మైసమ్మ చెరువులో ఆరో విడుతలో భాగంగా 60 వేల చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులవృత్తుల పరిరక్షణను ప్రధాన అంశంగా పరిగణలోకి తీసుకొని అ భివృద్ధి చేస్తున్నదన్నారు. సబ్సిడీ చేప పిల్లలను చెరువు ల్లో పెంచి పెద్దయ్యాక విక్రయించి ఆర్థికంగా ఎదగాలన్నారు. అప్పుడే మత్స్యకారుల కుటుంబాలు సంతోషం గా ఉంటాయన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కులవృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రత్యేక రా ష్ట్రం సిద్ధించాక చేపట్టిన చర్యలతో నేడు పూర్వవైభవం సంతరించుకున్నదని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు కలిపి కేవలం రూ.2 కోట్లు కేటాయించగా, తె లంగాణ వచ్చాక ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చేపపిల్లల విడుదలకు రూ.5 కోట్ల ను కేటాయించినట్లు తెలిపారు. గతంలో సముద్రాల వ ద్ద మాత్రమే లభించే చేపలు నేడు గ్రామాల నుంచి నగరాలకు ఎగుమతి చేసే స్థాయికి వచ్చిందని చెప్పారు. పె రిగి పెద్దయిన చేపలను విక్రయించేందుకు మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలను అందించామని స్పష్టం చే శారు. హైదరాబాద్‌లోనూ విలువైన భూములను వివిధ కుల వృత్తుల వారికి కేటాయించినట్లు తెలిపారు. ముదిరాజుల కోసం రూ.300 కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించడమే కాకుండా రూ.5 కోట్లతో భవన నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, సర్పంచ్ శ్రీకాంత్‌గౌడ్, మత్స్యశాఖ ఏడీ రాధా రోహిణి, రూరల్ తాసిల్దా ర్ పాండు, ఎంపీడీవో వేదవతి, జేపీఎన్సీ చైర్మన్ రవికుమార్, బుచ్చన్నగౌడ్, నర్సింహులు, విజయ్ ఉన్నారు.
ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు..
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 8 : ప్రతి గడపకూ సం క్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణనే అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేం ద్రంలో 3, 12, 13, 14, 26, 30, 31వ వార్డులకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన నూతన కార్యవర్గ సమావేశాలకు మంత్రి హాజరై మాట్లాడారు. ఎవరో వచ్చి వారి ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతో ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని చెప్పారు. గడిచిన ఉమ్మడి రాష్ట్ర పాలన, స్వరాష్ట్ర పాలనకు తేడాను ప్రజలు గమనించాలని సూ చించారు. పట్టణాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, ఎన్ఎన్జీ ట్రస్ట్ చైర్మన్ శ్రీహిత, వినోద్, కౌన్సిలర్లు లక్ష్మీదేవి యాదగిరిగౌడ్, ఉమర్, జహంగీర్, 3వ వార్డు కమిటీ అధ్యక్షుడు కమల్ సంజీవ, నాగేశ్, గుమా ల్ శ్రీను పాల్గొన్నారు.
డాక్టర్ వివేకం సేవలు చిరస్మరణీయం..
జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యులు ఐ.వివేకం మృతి చెందగా.. మంత్రి ఆయన ఇంటికి వెళ్లి మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివేకం కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు.