జడ్చర్ల, సెప్టెంబర్ 1 : టీఆర్ఎస్ ప్ర భుత్వ హయాంలోనే గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నాయని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. రూ.65లక్షలతో చేపట్టిన గంగాపూర్-లింగంపేట బీటీరోడ్డు నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తె లంగాణ వచ్చాక ప్రభుత్వం ప్రతి గ్రా మానికి, తండాకు బీటీరోడ్డు నిర్మించినట్లు తెలిపారు. జ డ్చర్ల నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాలు, తం డాలకు రోడ్లు నిర్మించినట్లు వివరించారు. గ్రామాల్లో ప్ర జలకు మౌలిక వసతుల కల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. పల్లెప్రగతితో గ్రా మాలన్నీ సుందరంగా మారాయన్నారు. పల్లె ప్రకృతివనాల ఏర్పాటు, మొక్కల పెంపకంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నదని తెలిపారు. హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటి పెంచాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, మా జీ వైస్‌ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు రఘుపతిరెడ్డి, శ్రీకాంత్, ఇమ్మూ, రవిగౌడ్ ఉన్నారు.