దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 1 : పాఠశాలల్లో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. అలా గే కౌకుంట్ల ఉన్నత, ఇస్రంపల్లి ప్రాథమిక పాఠశాలలను ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూ ర్ణ పరిశీలించారు. కాగా, దేవరకద్ర మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 5,252 మంది వి ద్యార్థులకుగానూ 1,424 మంది(27శాతం), ప్రైవేట్ స్కూళ్లల్లో 3,518 మందికిగానూ 230 మంది (6.5 శాతం) విద్యార్థులు హాజరయ్యారని ఎంఈవో జయశ్రీ తెలిపారు. చిన్నచింతకుం ట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 4,097మంది విద్యార్థులకుగానూ 837, ప్రైవేట్ స్కూ ళ్లల్లో 1,632మందికిగానూ 175మంది హాజరయ్యారని ఎంఈవో లక్ష్మణ్‌సింగ్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.