మరికల్, ఆగస్టు25: నులిపురుగుల నివారణే లక్ష్యంగా ప్రతి ఇంటికీ ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మానిటరింగ్ ఆధికారి సూర్యశ్రీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నులిపురుగుల మాత్రల పంపిణీ విషయమై గజ్జలమ్మగడ్డ కాలనీలో స్థానికులతో మాట్లాడారు. చిన్న పిల్లలు చేతులు శుభ్రపర్చుకోకపోవడంతో అనారోగ్యానికి గురవుతారన్నారు. ఈనెల 31వరకు మాత్రలను పంపిణీ చేస్తారని వాటిని తప్పనిసరి వాడాలని సూచించారు. 1 నుంచి 19 ఏండ్లలోపు వారికి మాత్రలను వేయాలన్నారు. ఆశ కార్యకర్తలతో మాట్లాడి నులిపురుగుల నివారణకు చేపట్టే చర్యలపై తెలియజేశారు. కార్యక్రమంలో నారాయణపేట ఇమ్యూనైజేషన్ అధికారి శైలజ, గోవింద్రాజ్, చంద్రకళ, భారతమ్మ, వెంకటయ్య, శశికళ పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి:డీఎంహెచ్‌వో రామ్‌మనోహర్‌రావు
నారాయణపేట టౌన్, ఆగస్టు25: జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని 100శాతం విజయవంతం చేయాలని డీఎంహెచ్‌వో రామ్‌మనోహర్‌రావు అన్నారు. బుధవారం పట్టణంలో మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా దవాఖానలోని పీపీ యూనిట్‌ను సందర్శించారు. పళ్ల ఎస్సీ వాడలో మాత్రల పంపిణీని తనిఖీ చేశారు. కార్యక్రమంలో డా.మోనేశ్, సురేశ్‌బాబు, మాస్‌మీడియా అధికారి హన్మంతు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని 15వ వార్డులో వార్డు కౌన్సిలర్ బండి రాజేశ్వరి పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. 2వ వార్డులో వార్డు కౌన్సిలర్ జొన్నలఅనిత ఇంటింటికీ తిరిగి పిల్లలకు మాత్రలు వేశారు. 10వ వార్డులో ఆర్పీ సౌభాగ్య, అంగన్వాడీ టీచర్ పూర్ణిమ, ఆశ వర్కర్ మమత మాత్రలు పంపిణీ చేశారు. 7వ వార్డులో కౌన్సిలర్ సలీం, అంగన్వాడీ టీచర్ శివలీల, ఆశవర్కర్ మునవర్ సుల్తానా మాత్రలు వేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సుభాష్, దేవరాజ్, శివరాంరెడ్డి, అనంతరెడ్డి, సీతారాములు, ఆనంద్, వార్డు అధికారి రాఘవేందర్ రెడ్డి, ఆశకార్యకర్తలు లక్ష్మి, శివలీల, అంగన్వాడీ టీచర్లు గీత, హెల్పర్ భాగ్య పాల్గొన్నారు.
ఊట్కూర్ మండలంలో..
ఊట్కూర్, ఆగస్టు25: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలో బుధవారం ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఊట్కూర్ 1వ అంగన్వాడీ కేంద్రం పరిధిలో పీహెచ్సీ వైద్యురాలు సురేఖ మాత్రలు వేశారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈవో హేమ్లాల్, సూపర్వైజర్ మణిమాల, అంగన్వాడీ టీచర్ వెంకటేశ్వరమ్మ, ఆశా కార్యకర్త పుష్ప పాల్గొన్నారు.
కర్ని పీహెచ్సీలో..
మక్తల్‌రూరల్, ఆగస్టు25: మక్తల్ మండలం కర్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం పిల్లలకు ఎంపీటీసీ రంగప్ప ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎన్ఎం చంద్రకళ, ఆశా వర్కర్లు జ్యోతి, అనిత, అంగన్వాడీ కార్యకర్త యశోద పాల్గొన్నారు.
కృష్ణ, మాగనూర్ మండలాల్లో..
కృష్ణ, ఆగస్టు25: కృష్ణ, మాగనూర్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో బుధవారం డాక్టర్ శ్రీమంత్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది, అంగన్వాడీ టీచర్లు నులిపురుగు నివారణ మాత్రలను పంపిణీ చేశారు. కృష్ణ మండలంలోని 2105 మంది పిల్లలకు, మాగనూర్ మండలంలో 1564 మందికి మాత్రలు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీమంత్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు