మహబూబ్‌నగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దళితులను ప్రధాన జాతీయ పార్టీలు ఓటు బ్యాంకుగా చూశాయే కానీ ఏనాడూ వారి జీవన పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రయత్నించలేదు. మొక్కుబడి పథకాలతో ఉద్ధరిస్తున్నామనే భ్రమ కల్పించాయి. దశాబ్దాలుగా సా మాజిక వివక్షకు, అణచివేతకు గురవుతున్న దళితుల ఉద్ధరణకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకంతో ఆశాదీపం వెలిగించారు. అణచివేతకు, అభద్రతకు గురవుతున్న దళితుల్లో సీఎం భరోసా కల్పిస్తున్నారు. దళితులను సంపూర్ణ సాధికారులను చేసేందుకు రూ.వేల కోట్లతో ప్రకటించిన దళితబంధు పథకం రాష్ట్రంలో నవశకానికి నాంది పలుకనున్నది. ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందనున్న ది. అర్హులైన వారందరికీ మేలు చేయడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. దళితబంధు పథకాన్ని ఉద్యోగులు, పింఛన్‌దారులకు సైతం వ ర్తింపచేస్తామని ప్రకటించడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఉద్యోగ సంఘాల నేతలు, దళితులు క్షీరాభిషేకాలు చేశారు.
దళితుల ప్రగతికి సోపానం..
దళితబంధు పథకం వారి ప్రగతికి సోపానంగా మారనున్నది. ప్రభు త్వం అందించే సాయంతో ఆర్థికంగా పరిపుష్టి సాధించేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దళితులంతా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఏ యూనిట్లు నెలకొల్పాలి. ఏ యూనిట్ పెడితే త్వరగా జీవితం లో స్థిరపడతాం వంటి చర్చ జోరుగా సాగుతున్నది. అయితే, ప్రస్తుతం ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద ప్రాథమిక దశలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 మందికి అమలవుతుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం అర్హులైన వారందరికీ పథకాన్ని విస్తరించనున్నా రు. దళితబంధులో లబ్ధిదారుల ఎంపిక రాజకీయాలకతీతంగా చేపట్టనున్నారు. రూ.10 లక్షలతో ఏయే యూనిట్లు స్థాపించాలనే సమాచారం బుక్లెట్ల రూపంలో అందించనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పథకాలపై మార్గనిర్దేశం చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏ ర్పాటు చేస్తారు. యూనిట్లు ప్రారంభించిన తర్వాత వాటిపై పర్యవేక్షణ ఉంటుంది. దీని కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మండల స్థాయిలో అధికారిని నియమిస్తారు. అధునాతన సాంకేతిక విధానాలతో ప్రతి లబ్ధిదారుడికి ప్రత్యేక గుర్తింపు కార్డు అందిస్తారు. దశాబ్దాలుగా చీకట్లో మగ్గుతు న్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు గొప్ప లక్ష్యంతో ముందు కు సాగుతున్న సీఎం కేసీఆర్‌కు పార్టీలకతీతంగా సబ్బండ వర్ణాలు జేజేలు పలుకుతుండడం విశేషం. ఇంత గొప్ప పథకం చరిత్రలో నిలిచిపోతుందని అందరూ ముక్తకంఠతో పేర్కొంటున్నారు.
అందరి గుండెల్లో సీఎం కేసీఆర్..
మహబూబ్‌నగర్, ఆగస్టు 17 : అందరి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం తపిస్తున్నారని టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవోఎస్ నా యకులు చంద్రనాయక్, క్రాంతికుమార్‌గౌడ్, కృష్ణమోహన్, నరసింహారెడ్డి, వెంకట్రామిరెడ్డి, శ్యాంసుందర్, రవీంద్రనాథ్, చంద్రశేఖర్, ప్రి యాంక, మహేశ్వర్‌రెడ్డి, దేవేందర్, రాజగోపాల్, బాబురావ్, శివకుమా ర్, సత్యనారాయణ, అనిల్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఎం నిర్ణయం హర్షణీయం..
దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేయడం హర్షించదగ్గ విషయం. అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దళితులు ఆర్థికంగా ఎదగడానికి ఇదో సువర్ణ అవకాశం. భవిష్యత్‌లో రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధును అమలు చేయాలి.
ఎస్సీల అభివృద్ధికి ఊతం..
దళితుల కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారు కాబట్టే దళితబంధు పథకం తీ సుకొచ్చారు. రైతుబంధు పథకం ద్వారా రై తులను ఆదుకున్న తీరుగానే దళితబంధు సైతం ఎస్సీల అభివృద్ధికి ఊతమివ్వనున్నది. ఉద్యోగులకు కూడా వర్తింపజేయడం హర్షణీయం. యావత్ తెలంగాణ ఉద్యోగుల పక్షాన సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు కృతజ్ఞతలు.
అండగా నిలుస్తున్న సీఎం..
రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైంది. అందుకే ప్రతి దశలోనూ సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షానే నిలిచారు. దళిత బంధు ఉద్యోగులకు కూడా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
కనీవినీ ఎరుగని విధంగా ప్రభుత్వం దళితుల కోసం చేస్తున్న కృషి అమోఘం.
రూ.24 లక్షలు సబ్సిడీ పొందాను
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలపై ప్రేమ కనబరుస్తున్నది. అభివృద్ధికి దోహదం చేస్తున్నది. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి డెవలప్ చేస్తున్నది. నేను తెలంగాణ ప్రభుత్వ సహకారంతో రైస్‌మిల్లు పెట్టాను. రూ.24 లక్షల రూపాయల సబ్సిడీ పొందాను. నేనే కాదు చాలా మంది ట్రాక్టర్లు, జేసీబీలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం గొప్పగా ఉంటుంది.