అచ్చంపేట, ఆగస్టు 17 : బంజారుల పండుగలు, సంప్రదాయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇందులో భాగంగా ప్రతి ఏటా శ్రావణమాసంలో తీజ్ పండుగ ను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయి తీ. సంస్కృతిని కాపాడుతూ ప్రకృతిని ఆరాధించే మొ లకల పండుగ సందడి తండాలు, గ్రామాల్లో ఇప్పటి కే ప్రారంభమైంది. ముఖ్యంగా పెండ్లికాని యువతు లు తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలతో పండుగ ను జరుపుకొంటారు. బంజార మహిళలు, యువతు ల ఆటపాటలు, నృత్యాలు, డప్పులదరువు మధ్య పండుగను నిర్వహిస్తారు. అచ్చంపేట ప్రాంతంలోని దర్శన్‌గడ్డ, అక్కారం, గుంపన్పల్లి, సురాపూర్, పెద్దతండా, చెదురుబావి తండా, చెన్నంపల్లి, చిట్లంకుం ట, పద్మనపల్లి, అచ్చంపేట తదితర తండాలు, గ్రా మాల్లో పండుగలు ప్రారంభమయ్యాయి. కొన్ని తం డాల్లో తీజ్ పండుగను ముగించారు.
పండుగ ఇలా..
పండుగ ప్రారంభానికి ముందు యువతులంతా పెద్దవాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇంటింటికీ తి రిగి విరాళాలు సేకరిస్తారు. అంగడికి వెళ్లి గోధుమలు, శనగలు తెచ్చుకుంటారు. గోధుమలను నానబెట్టి మొ లకెత్తించేందుకు బుట్టలను అల్లుతారు. ప్రతి ఒక్కరూ ఒక్కో బుట్టను తయారు చేస్తారు. బుట్టలన్నింటినీ ఒ కే చోట ఉంచేందుకు పందిరి ఏర్పాటు చేస్తారు. పుట్టమట్టిని తెచ్చి అందులో పశువుల ఎరువును కలుపుతారు. బంజారుల ఆరాధ్యదైవమైన మేరామ అమ్మవారు, సేవాలాల్ మహరాజ్, సీత్లాభవాని పేర్లతో త యారు చేసిన బుట్టల్లో ముందుగా తండాపెద్దలతో ఎ రువు కలిపిన మట్టిని బుట్టల్లో పోయిస్తారు. గోధుమలను నానబెట్టే క్రమాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. నానబెట్టిన గోధుమలను మట్టికలిపిన బుట్ట ల్లో చల్లుతారు. గోధుమ మొలకలను తీజ్‌గా పిలుస్తా రు. మొక్కలు ఎంతబాగా మొలకెత్తితే అంత మంచి జరుగుతుందని నమ్మకం. తొమ్మిది రోజుల పాటు యువతులు ఉపవాసాలుంటారు. ఉప్పు, కారం లేని భోజనం చేస్తారు. తండా నుంచి ఎవ్వరూ బయటకు వెళ్లకూడదు. మాంసాహారాలు తీసుకోరు. బావి, చేతిపంపు నుంచి తెచ్చిన నీటి బిందెను నేలపై పెట్టకూడ దు. నృత్యాలు చేసినంతసేపు బిందెను నెత్తిపై పెట్టుకుంటారు. తర్వాత మొలకలకు పోస్తారు. ఉయ్యాల కట్టి ఊగుతారు.
తొమ్మిది రోజులు ప్రత్యేక కార్యక్రమాలు..
తొమ్మిది రోజులపాటు రోజుకో పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. నానబెట్టిన శనగలకు రేగుముళ్లను గుచ్చే విలక్షణమైన ఆచారాన్ని బోరడి ఝుష్కేరో పేరుతో పిలుస్తారు. సాయంత్రం గోధుమలను బుట్టల్లో చల్లుతారు. పెండ్లికాని యువతులు రేగుముళ్లకు శనగలు గుచ్చుతుంటే బావ వరుస అయినవారు ముళ్లను కదిలిస్తారు. అయినా అమ్మాయిలు సహనంతో శనగలను గుచ్చాల్సి ఉంటుంది. చెల్లెలిని ఎడిపించేందుకు అన్నలు కూడా పాల్గొంటారు. బిందెల్లో నీళ్లను తెచ్చి బుట్టలకు పోసేటప్పుడు సేవాలాల్ పాటలతో స్మరిస్తారు. తీజ్ ఎంత ఏపుగా, పచ్చగా పెరిగితే తమకు నచ్చిన జీవితభాగస్వామి వస్తారని, బతుకులు పచ్చగా ఉండి, తండా బాగుపడుతుందని విశ్వాసం. ఏడో రోజు ఢమోళి చుర్మో (రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామ అమ్మవారికి సమర్పిస్తారు. ఎనిమిదో రోజు బంజారుల ఆరాధ్య దేవతల ప్రతిరూపాలను మట్టితో చేసి పూజిస్తారు. ఆడపిల్లలు తమను డోక్రీలుగా భావిస్తారు. పెండ్లి అయితే తమ పుట్టింటిని వదిలి వెళ్లాల్సి వస్తుందని ఏడుస్తారు. వారిని సోదరులు ఓదారుస్తుండగా.. బావలు ఆటపట్టిస్తారు. చివరిరోజు నిమజ్జనం కనుల పండువగా నిర్వహిస్తారు. మొలకల బుట్టలకు పూజలు చేశాక.. తీజ్‌ను తలపై పెట్టుకుంటారు. తీజ్‌ను పెద్దల తలపాగాలో ఉంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు. సంప్రదాయబద్దంగా నృత్యాలు చేస్తూ వెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. సోదరులు కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు. అచ్చంపేట పట్టణంలో ఈ నెల 21న ప్రారంభించనున్నారు. 29న భారీ ఊరేగింపుతో నిమజ్జనం సాగనున్నది.