మహబూబ్‌నగర్, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో పవర్”ఫుల్’గా సరఫరా అవుతున్నది. దేశమంతా కరెంట్ కష్టాలు కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రం విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్నాయి. ఉమ్మడి పాలనలో వ్యవసాయ రంగానికి,గృహాలకు సరఫరాలో కోతలు విధించేవారు. కేసీఆర్ సీఎం అయ్యాకవిజన్కు పదును పెట్టారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఇంజినీర్ల సహకారంతో తక్కువ సమయంలోనే కరెంట్ కష్టాలకు చెక్ పడేలా చేశారు. దీంతో మండు వేసవిలో సైతం నిరంతరం కరెంట్ సరఫరా అవుతున్నది. గృహాల్లో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వద్ద సేద తీరుతున్నారు. 24 గంటల కరెంట్‌తో బోరుబావుల కింద పంటల సాగు సంబురంగా సాగుతున్నది.
దేశంలో ఎ న్నడూ లేనంతగా ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విద్యుత్ సంక్షోభంతో దాదాపుగా అన్ని రాష్ర్టాల్లోనూ విద్యుత్ కోతలు విధిస్తున్నారు. విద్యుత్ కోతలతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నడిచే పరిస్థితి లేక వివిధ రాష్ర్టాల్లో జనం ఉక్కుపోతలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పొరుగు రా ష్ర్టాలైన కర్ణాటక, ఏపీల్లో విద్యుత్ కోతలతో జనం ఎండ వేడిమి, ఉక్కపోత, భరించలేని చెమటతో కష్టాలు పడుతుంటే.. తెలంగాణలో మాత్రం అలాంటి సమస్యలే లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నది. మండు వేసవిలో కూడా రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా గృహావసరాలకు కూడా 24 గంటల కరెంట్ ఇవ్వడంతో జనం ఉక్కుపోతల బారి నుంచి తప్పించుకుంటున్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఉద యం 9 గంటల నుంచే సూర్యుడి తాపానికి జనం బెంబేలెత్తిపోయి ఇండ్ల కే పరిమితం అవుతున్నారు. ఇండ్లలో వేసవి తాపాన్ని భరించేందుకు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు నిరంతరాయంగా నడిపించాల్సి వస్తున్నది. దీంతో ఊహించని స్థాయిలో కరెంటు లోడ్ పెరిగిపోతున్నది. అయినా సబ్స్టేషన్ల పరిధిలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు, స్థానికంగా ఉండే ట్రాన్స్ఫార్మర్ల స్థాయిని పెంచడం, కొత్త లైన్లు, సబ్ స్టేషన్లు నిర్మించడంతో ఎంత లోడ్ పడినా కాలిపోని పరిస్థితి వచ్చింది.
గతంలో లోడ్ తట్టుకోలేక సబ్ స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రిపేరీకే రోజులు పట్టేది. గ్రామాల్లో అయితే మరమ్మతులు ఎప్పుడు చేయిస్తారో అర్థం అయ్యేది కాదు. ఇంతటి సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో స్వయంసమృద్ధి సాధించడంతో ఇప్పుడు ప్రజలు మండు వేసవిలోనూ చల్లటి గాలికి సేదతీరుతున్నారు. మండు టెండల్లోనూ చల్లని గాలిని అందిస్తున్నందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.
తెలంగాణ ఏర్పాటైతే చీకట్లు తప్పవని పిల్లిశాపాలు పెట్టిన సమైక్యనేతలు.. తెలంగాణలో అదే పరిస్థితిని నెలకొల్పి వెళ్లిపోయారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన 2014 జూన్ 2 నాటికి విద్యుత్ రంగంలో తీవ్రమైన సంక్షోభం ఉన్నది. అప్పటి గరిష్ఠ విద్యుత్ డిమాండ్‌కు సుమారు 2,700 మెగావాట్ల లోటు ఉండేది. జిల్లా కేంద్రాల్లో రాత్రి, పగలు.. మూడు గంటల చొప్పున ఆరు గంటల కోతలుండేవి. మండల కేంద్రాల్లో రోజూ 8 గంటలకుపైగా, గ్రామాల్లో పగలంతా కరెంట్ ఉండేది కాదు.
వ్యవసాయానికి పేరుకే 6 గంటల విద్యుత్.. కానీ 4 గంటలు అందుబాటులో ఉండేది కాదు. పైగా అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా ఇష్టం వచ్చినప్పుడు సరఫరా చేసేవారు. పరిశ్రమలకు వారానికి రెండ్రోజులు పవర్ హాలీడేగా ప్రకటించారు. అంతకంటే ఎక్కువగానే కోతలు ఉండేవి. ఇక వేసవి వచ్చిందంటే కరెంట్ అనే మాటే ఉండేది కాదు. దీంతో ప్రజలు ఎండ వేడిమి తట్టుకోలేక ఇబ్బంది పడేవారు. ఫ్యాన్లు తిరగక.. ఏసీలు, కూలర్లు పనిచేయక తీవ్రమైన ఎండ వేడిమిని, ఉక్కపోతను భరించలేక విసనకర్రలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఎక్కడైనా పచ్చని చెట్లుంటే అక్కడికి వెళ్లి సేదతీరాల్సి వచ్చేది.
తెలంగాణ ఏర్పాటయ్యాక… ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలో, విద్యుత్ సమస్యను ఎలా అధిగమించాలో స్పష్టంగా తెలిసిన సీఎం కేసీఆర్ ఆది నుంచే తన విజన్‌కు పదును పెట్టారు. అత్యంత ప్రాముఖ్యమున్న విద్యుత్ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. సమైక్యవాదులు చెప్పింది తప్పని నిరూపించడానికి ఐదు నెలలపాటు విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఇంజినీర్లు కంటికి నిద్ర లేకుండా శ్రమించారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను రచించి అమలుచేస్తూ.. వేగంగా ప్రగతిని సాధించారు.
దీంతో 2014 నవంబర్ 20 నాటికే గృహ, వాణిజ్య, పారిశ్రామికరంగాల్లో విద్యుత్ కోతలకు ఫుల్స్టాప్ పెట్టారు. అన్ని రంగాల్లోని వినియోగదారులందరికీ నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వడంతో ప్రభుత్వంపై నమ్మకం, భరోసా కల్పించారు. 2018 జనవరి 1 నుంచి నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్ని రంగాలకు కూడా తెలంగాణ సర్కార్ 24 గంటల నాణ్యమైన విద్యుత్, వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ను అందించడం ప్రారంభించింది. దీంతో దేశంలోనే విద్యుత్ రంగంలో ఓ కొత్త చరిత్రను సృష్టించారు. ఇదంతా సీఎం కేసీఆర్ దార్శనీకత వల్లే సాధ్యమైంది. అందుకే నేడు విద్యుత్ లేక దేశంలోని అనేక రాష్ర్టాలు వేసవి తాపాన్ని తట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటే.. తెలంగాణ మాత్రం మండు వేసవిలోనూ చల్లచల్లగా సేదతీరుతున్నది.
హాయిగా.. చల్లగా..
వనపర్తి, మే 3 (నమస్తే తెలంగాణ) : ఎ ప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పెరుగడం తో బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. వనపర్తి జిల్లాలో గరిష్ఠంగా 44, కనిష్ఠంగా 29 డిగ్రీలు నమోదవుతున్నాయి. దీం తో ఎండలకు తాళలేక పొద్దున్నే పనులు ము గించుకొని ఇంటికి చేరుతున్నారు. ఫ్యాన్లు, ఏ సీలు, కూలర్ల కింద సేద తీరుతున్నారు. కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్గడ్తోపాటు దే శంలోని చాలా రాష్ర్టాల్లో విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతుంటే.. తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో సైతం నిరంతరం వి ద్యుత్ సరఫరా అవుతున్నది. దీంతో హాయి గా.. చల్లగా ఇంట్లో గడుపుతున్నారు. తెలంగా ణ ఏర్పడితే చీకట్లు కమ్ముకుంటాయని ఉమ్మ డి పాలనలో నేతలు వెక్కిరించిన సందర్భాల కు భిన్నంగా నేడు రాష్ట్రంలో విద్యుత్ వెలుగు లు విరజిమ్ముతున్నాయి. మిగులు విద్యుత్‌తో దేశంలోనే కరెంట్ పంపిణీలో రాష్ట్రం ముం దంజలో ఉన్నది.
పోల్టుపోల్ చెక్ చేస్తాం..
మహబూబ్‌నగర్ జిల్లాలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతరం విద్యుత్‌ను అందిస్తున్నాం. ఎప్పుడైనా లోడ్ సమస్య వస్తే మేనేజ్మెంట్ ఇతర ఎక్స్చేంజీల ద్వారా కొనుగోలు చేసి సమస్యను తీరుస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 6 మిలియన్ యూనిట్ల లోడ్ ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా లోడ్‌ను తట్టుకొని అన్ని రంగాలకు కోతలు లేకుండా కరెంట్ అందిస్తున్నాం. అప్పుడప్పుడు గాలి దుమారం, వర్షాల ప్రభావంతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నది. అయినా పోల్ టు పోల్ చెక్ చేసి గంటల వ్యవధిలోనే విద్యుత్ పునరుద్ధరణ చేస్తున్నాం. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్య వచ్చినా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు మా సిబ్బంది సిద్ధంగా ఉంటారు.
– మూర్తి, ఎస్ఈ, టీఎస్ఎస్పీడీసీఎల్, మహబూబ్‌నగర్
కరెంటు కోతల్లేవు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం అవుతుందని అనవసరంగా అభాండాలు వేసి న వారి నోర్లు మూతపడ్డాయి. పక్క రాష్ట్రమైన ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో విద్యుత్ సరఫరా విషయంలో వంద శాతం మేలు. మండుటెండల్లో, ఉక్కపోతగా ఉన్న సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండడంతో ఫ్యా న్లు, కూలర్ల కింద చల్లని గాలిలో హాయిగా సేదతీరుతున్నాం. కరెంట్ కోతలు లేనందున రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపవాస దీక్ష ముగించాం.
– రఫీ, శాంతినగర్
హాయిగా గడుపుతున్నాం..
తెలంగాణ ప్రభుత్వం నిరంతర విద్యుత్ స రఫరా చేయడంతో ఉక్కపోత నుంచి ఉపశమ నం కలుగుతున్నది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పటికీ.. హాయిగా కూలర్లు, ఫ్యాన్ల కింద సేదతీరుతున్నారు. ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్లు, కూలర్లు ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాడుతు న్నాం. కరెంట్ కోతలు ఉన్న రాష్ర్టాలు తెలంగాణను చూసి సిగ్గుపడుతున్నాయి.
– శివ, శాంతినగర్