మూసాపేట, ఆగస్టు 17: సీజనల్ వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి విజయ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని చక్రాపూర్‌లో మంగళవారం ఆయన పర్యటించారు. గ్రామంలోని 11ఏండ్ల బాలికకు డెంగీ రావడంతో మలేరియా అధికారి, పీహెచ్సీ సిబ్బంది పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి పరిసరాలను పరిశీలించారు. ఇండ్ల ఎదుట, ఆవరణలో నిల్వఉన్న నీటిని తొలగించాలన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ విస్తరించకుండా ఎప్పటికప్పుడు సర్వే చేస్తూ నివేదిక ఇవ్వాలన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా వైద్యసిబ్బందికి తెలుపాలన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి విజయ్‌కుమార్ పేర్కొన్నారు. జడ్చర్ల పట్టణంలోని గౌరీశంకర్‌కాలనీలో ఓ వ్యక్తి మలేరియాకు గురైనట్లు తెలుసుకున్న విజయ్‌కుమార్, ఆర్బన్ హెల్త్‌సెంటర్ డాక్టర్ శివకాంత్ మంగళవారం బాధితుడి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేశారు. అదేవిధంగా కుటుంబసభ్యుల నుంచి శాంపిల్స్ సేకరించారు. పరిసర ప్రాంతంలోని ఇండ్లల్లో ఫీవర్‌సర్వే చేశారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ వానకాలం సీజన్ దృష్ట్యా దోమల ద్వారా డెంగీ, మలేరియా, చికన్‌గున్యా వంటి జ్వరాలు ప్రబలే అవకాశాలున్నాయన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పలు ఇండ్లల్లో నిల్వ ఉన్న నీటిని పారవేయించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సతీశ్, సూపర్వైజర్లు పార్వతమ్మ, ఏఎన్ఎం, ఆశవర్కర్లు తదతరులు పాల్గొన్నారు.