మహబూబ్నగర్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : బండి సంజయ్ పాదయాత్రలో భా గంగా జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఏ ర్పాటు చేసిన బహిరంగ సభ వెలవెలపోయింది. మాజీ మంత్రి, గద్వాల మాజీ ఎమ్మెల్యే అయిన డీకే అరుణ సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చే సిన బీజేపీ బహిరంగ సభ విఫలమైంది. గద్వాల పట్టణ నడిబొడ్డున ఉన్న తేరు మైదానంలో సుమా రు 10వేల మంది ప్రజలు కుర్చీల్లో కూర్చునేందు కు అవకాశం ఉంది. గురువారం నాటి సభకు సు మారు 5వేల కుర్చీలు వేశారు. అయితే సగానికి పై గా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. బండి సంజ య్ మాట్లాడే సమయానికి చాలా మంది తిరిగి వెళ్లిపోయారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలైన డీకే అరుణ కార్యకర్తలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా కు ర్చీలు నిండలేదు.
మాజీ మంత్రిగా పనిచేసిన డీకే అరుణ నియోజకవర్గమైన గద్వాలలో సభ జరిగితేనే పరిస్థితి ఇలా మారడంపై ఆ పార్టీలోనే చర్చకు దారితీసింది. గద్వాల సభ కోసం చాలా ముందు నుంచే కసరత్తు ప్రారంభించినా సభ సక్సెస్ అవ్వకపోవడంపై బీజేపీలో భిన్నస్వరాలు వినిపించా యి. బండి పాదయాత్ర ఈ నెల 14న ప్రారంభ మైంది. అప్పటికే సుమారు నెల రోజుల ముందే పాదయాత్ర ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అంటే దాదాపుగా నెల 40 రోజుల ముందే గద్వాల బహిరంగ సభకు సంబంధించి బీజేపీ నా యకులందరికీ సమాచారం ఉంది. బహిరంగ సభ కు ముఖ్య అతిథిగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి, ఎమ్మెల్యే ఈటల సహా పలువురు పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. కానీ గద్వాల పట్టణంలోని నడిబొడ్డున ఉన్న తేరు మైదానంలో బీజేపీ బహిరంగ సభ కో సం వేసిన కుర్చీలు కూడా నిండకపోవడంతో సభ వెలవెలపోయిందని స్థానికులు చర్చించుకున్నారు. గ్రామాల్లో వాహనాలను ఏర్పాటు చేసినా సభకు జనం రాలేదు. రాష్ట్రంలో ఎలాంటి సమస్య లేకుం డా పాలన నడుస్తోంటే… మహా సంగ్రామ యాత్ర పేరిట బండి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడంపై స్పందన సరిగా లేదని చెప్పేందుకు గద్వాల సభ ఉ దాహరణగా నిలుస్తుందని ప్రజలు అంటున్నారు.