తెలంగాణలోని సంక్షేమ పథకాలు తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కర్ణాటక రాష్ట్ర బీజేపీ వ్యవహరాల ఇన్చార్జి డీకే అరుణ చొరవ తీసుకోవాలని కర్ణాటక రైతులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ గురువారం జోగుళాంబ గద్వాలలో బహిరంగ సభలో పాల్గొంటాడ ని తెలిసి కర్ణాటక నుంచి పలువురు రైతులు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలు కర్ణాటకలోనూ అమలు చేయాలని కోరుతూ బండి సంజయ్, డీకే అరుణకు వినతి పత్రాన్ని అం దజేశారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉ చిత విద్యుత్, దళితబంధు వంటి పథకాలు అం దించేలా కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ దృష్టికి తీసుకుపోయి తమ రాష్ట్రంలోనూ అమలు అయ్యే లా చూడాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని బండి, డీకే దృష్టికి తీసుకుపోయారు.
బండి పాదయాత్రను తాము స్వాగతిస్తున్నామని, మీ లక్ష్యాలు నెరవేరాలని తామూ కోరుకుంటున్నామని కూడా రైతులు తమ లేఖలో ఆకాంక్షించారు. వ్యవసాయం దండగ అనే స్థాయి నుంచి వ్యవసా యం పండుగలా మారే స్థాయికి తెలంగాణ చేరుకుందని, అలాంటి పరిస్థితి కర్ణాటకలోనూ రావాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతున్నదని చెప్తున్న తరుణంలో తెలంగాణలో అమలు అవుతున్న సం క్షేమ పథకాలను కర్ణాటకలోనూ అమలు చేయాలని కోరారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కన్నడ రైతుల కోసం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి తె లంగాణ స్థాయి పథకాలు మాకు అమలయ్యేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రైతుల నుంచి వినతి పత్రం అందుకుని చదివిన తర్వాత బండి సంజయ్ వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కొద్దిసేపు తికమక పడ్డారు. వినతి పత్రాన్ని మౌనంగా తీసుకున్న బండి.. సమాధానం చెప్పలేక చడీ చప్పుడు చేయకుండా వెళ్లిపోయారు.
కర్ణాటక రైతులు వినతి ఇచ్చిన వ్యవహారం సంచలనం సృష్టిస్తున్నది. బండి సంజయ్ పాదయాత్ర వద్దకు వచ్చి బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో కనీస సంక్షేమ పథకాలు అమలు చేయలేని పరిస్థితుల్లో బండి సంజయ్ పాదయాత్ర చే యడంపై స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నా రు. కర్ణాటకలోని రాయచూరు జిల్లాకు జోగుళాం బ గద్వాల జిల్లా సరిహద్దుల్లో ఉంటుంది. అక్కడికి ఇక్కడికి సంబంధ బాంధవ్యాలుంటాయి. వ్యాపారాల కోసం కూడా ప్రజలు తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు. ఈ తరుణంలో తెలంగాణ పథకాలపై కర్ణాటక ప్రజలకు అవగాహన ఉంది. ఇక్కడి పథకాలు తమకు అమలు కావడం లేదని బాధ వారి లో ఉంది. ఇటీవలే రాయిచూరు ఎమ్మెల్యే సైతం తమ ప్రాంతంలో అభివృద్ధి జరగడం లేదని… స మీపంలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతోందని అందుకే రాయిచూరును తెలంగాణలో క లపాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పు డు కర్ణాటక రైతులు తెలంగాణకు వచ్చి మరీ తెలంగాణ వంటి పథకాలు మాకు వచ్చేలా చూడండని బండికి లేఖ ఇవ్వడం సంచలనంగా మారింది. కర్ణాటక రైతుల వ్యవహారంతో తెలంగాణలో బీజేపీకి దిక్కుతోచని స్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.