మహబూబ్‌నగర్, ఏప్రిల్ 15 : కవిత్వంతో స మాజాన్ని మేల్కొల్పుదామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జెడ్పీ సమావేశ మందిరంలో అవధాన కళానిధి బ్రహ్మశ్రీ డాక్టర్ ఆముదాల మురళీచే సంపూర్ణ శతావధానం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి.. జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైక్య పాలనలో సాహిత్యానికి గుర్తింపులేదన్నారు. నేడు స్వరాష్ట్రంలో కవులు, కళాకారులకు ఎంతో గుర్తింపు దక్కుతుందన్నారు. కవులు, కళాకారులకు మహబూబ్‌నగర్ పెట్టిన పేరన్నారు. ఆముదాల మురళీ కవిత్వం ఆకట్టుకున్నది. కవులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శాలువా, మెమోంటోతో సత్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, సాహితీవేత్తలు, కవులు పాల్గొన్నారు.
ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో రూరల్ బ్యాక్‌యార్డ్ షీప్ డెవలప్మెంట్ పథకం కింద 10 మంది లబ్ధిదారులకు 10 గొర్రెల చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓసీలకు చెందిన గ్రామీణ సన్నకారు రైతులకు అదనపు ఆ దాయం సమకూరేలా గొర్రెలను అందజే స్తున్నామన్నారు. అనంతరం కోయిలకొండ చౌరస్తాలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠలో పాల్గొని పూజలు చేశారు. ఆయా కా ర్యక్రమాల్లో పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, షీప్ ఫెడరేషన్ చైర్మన్ శాంతయ్యయదవ్, నర్సింహులు, కమలాకాంత్, డాక్టర్ నరేశ్ ఉన్నారు.