దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు
మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
మాగనూర్, మార్చి 13 : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని మక్తల్ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని వ ర్కూర్లో ఎమ్మెల్యే, జెడ్పీటీసీ వెంకటయ్య, సర్పంచ్ నిర్మలమ్మతో కలిసి సీసీ రోడ్డు నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సా ధ్యమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని, ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసేలా గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు. తాగునీటి సమస్య గ్రామస్తులు ఎమ్మె ల్యే దృష్టికి తీసుకెళ్లాగా స్పందించిన ఆయన సొంత ఖర్చుల తో ట్యాంకర్‌ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కృష్ణ, ఎస్సై నరేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
చెన్నప్ప కుటుంబానికి న్యాయం చేస్తా…
మక్తల్ రూరల్, మార్చి 13 : టిప్పర్ ఢీకొన్న ఘటనలో మక్తల్ పట్టణానికి చెందిన బండారి చెన్నప్ప (60) మృతి చెందడంతో బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం హామీ ఇ చ్చారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో చెన్నప్ప మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిట్టెం బాధిత కుటుంబ స భ్యులను పరామర్శించారు. ఇదిలా ఉండగా బాధిత కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు ఘటనపై ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషి యా చెల్లించాలని ప్రజా సంఘాల నాయకు లు చంద్రశేఖర్, కృష్ణ, రవి తదితరులు ఎమెల్యేను కోరారు. ఈమేరకు ఎమ్మెల్యే స్పందించి బాధిత చెన్న ప్ప కుటుంబానికి ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. టిప్పర్ యజమానితో బాధిత కుటుంబానికి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మె ల్యే సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
లారీలపై చర్యలు తీసుకోవాలి
కర్ణాటకలోని శక్తినగర్ విద్యుత్ థర్మల్ ప్రాజెక్టు నుంచి బూడిద లారీలు ప్రతిరోజూ మక్తల్ మీదుగా అధిక లోడ్, ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్నాయని, దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలో అధిక లోడ్‌తో టిప్పర్ రోడ్డు పక్క నుంచి వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడన్నారు. బూడిద లారీలు, టిప్పర్ల డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఓవర్ స్పీడ్‌తో నడుపడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. ప్రతిరోజూ అధిక లోడ్‌తో శక్తినగ ర్ నుంచి వచ్చే బూడిద లారీల వల్ల ప్రమాదాలతోపాటు రహదారులు దెబ్బతింటున్నాయన్నారు. ఇది వరకు బూడిద లారీలను నిలిపివేయాలని పోలీసు అధికారులను ఆదేశించడం తో బీజేపీ నాయకులు అడ్డుకొని రాజకీయం చేశారని ఎమ్మెల్యే చిట్టెం విచారం వ్యక్తం చేశారు. ఆర్టీవోతో మాట్లాడి రోడ్డు నిబంధనలు పాటించని వాహనాలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
చెక్కు పంపిణీ
మండలంలోని పస్పుల గ్రామానికి చెందిన రాములుకు సీఎంఆర్ఎఫ్ కింద రూ.60 వేల చెక్కును మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు శంషుద్దీన్, నాయకుడు రాఘవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు
పట్టణంలోని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ న్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎ మ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, శ్రే ణులు, అభిమానుల మధ్య చిట్టెం కేక్ కట్ చేసి కార్యకర్తల కు తినిపించారు. కార్యక్రమంలో నర్వ ఎంపీపీ జయరాము లు శెట్టి, ఊట్కూర్ జెడ్పీటీసీ అశోక్‌గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్‌గుప్తా, ఊట్కూర్ మండల కమి టీ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, మక్తల్ పట్టణ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, మీడియా సెల్ కన్వీనర్ నేతాజీరెడ్డి, నాయకులు రాంలింగం, ఈశ్వర్‌యాదవ్ పాల్గొన్నారు.