ఇల్లెందు, ఫిబ్రవరి 16 : బీఆర్ఎస్ పార్టీ ఇల్లెందు మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్యను బీఆర్ఎస్ పట్టణ నాయకులతో కలిసి దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. సోమవారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి 13వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గా ఎన్నికైన దండు సారయ్యను కొత్త కాలనీ తన ఇంటి వద్ద పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శాలువా పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా దిండిగాల రాజేందర్ మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా అనుక్షణం కష్టపడి గెలిచినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ జబ్బర్, సిలివేరి సత్యనారాయణ, ఎస్ రంగనాథ్, అబ్దుల్ నబీ, జెకె శీను, మహమ్మద్ జాఫర్ హుస్సేన్, ఏంటెక్ మహేందర్, శ్రీను, పరికపల్లి రవి, పోషాలు, ఘాజి, వసంతరావు పాల్గొన్నారు.