– వైస్ చైర్‌పర్సన్‌గా కొయ్యడ రజని శ్రీను గౌడ్
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 16 : భూదాన్ పోచంపల్లి మున్సిపల్ చైర్మన్‌గా తడక వెంకటేశ్వర్లు, వైస్ చైర్‌పర్సన్‌గా కొయ్యడ రజని శ్రీను గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి మున్సిపాలిటీలోని 13 మంది కౌన్సిలర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ పార్టీ చైర్మన్‌గా తడక వెంకటేశ్వర్లు ఎన్నిక నిర్వహించగా దేవరాయ కుమార్ ప్రతిపాదించగా, మూడో వార్డ్ కౌన్సిలర్ రావుల జంగయ్య బలపరిచారు. తడక వెంకటేశ్వర్లుకు మద్దతుగా 8 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ నుండి కుడికాల అఖిలకు మద్దతుగా కౌన్సిలర్ నాలుగో వార్డ్ కౌన్సిలర్ చక్రపాణి ప్రతిపాదించగా, ఐదో వార్డ్ కౌన్సిలర్ బాతుక లింగస్వామి బలపరిచారు. దీంతో మెజార్టీ కలిగిన కొయ్యడ రజిని శ్రీను గౌడు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తడక వెంకటేశ్వర్లు మాట్లాడుతు రాజకీయాలకతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.
చారిత్రాత్మక, పర్యాటక, హెరిటేజ్ విలేజ్ గా పేరొందిన భూదాన్ పోచంపల్లిని మరింతగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీని ఆదర్శవంతంగా దిద్దుతానన్నారు. చేతి వృత్తుల సంక్షేమ కోసం పాటుపడతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీరామ్ మంజుల, కొండమడుగు ఎల్ల స్వామి, రావుల జంగయ్య యాదవ్, పెద్దల చక్రపాణి, బాతుక లింగస్వామి, కర్నాటి వరలక్ష్మి నరసింహ, రాపోలు కావ్య వేణు, దేవరాయ కుమార్, జింకల లావణ్య, యాదగిరి ముదిరాజ్, సూరపల్లి రాధిక రమేష్ నేత పాల్గొన్నారు.

భూదాన్ పోచంపల్లి మున్సిపల్ చైర్మన్‌గా తడక వెంకటేశ్వర్లు