బాలానగర్, మార్చి 13 : మండలంలోని హేమాజీపూర్, బిల్డింగ్తండా, నేలబండతండాల్లో ఆదివారం టీఆర్ఎస్వీ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు యూత్వింగ్ మండల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్ తెలిపారు. హేమాజీపూర్ గ్రామాధ్యక్షుడిగా శివరాజ్, ఉపాధ్యక్షుడిగా వంశీ, ప్రధానకార్యదర్శిగా రాఘవేందర్, బిల్డింగ్తండా అధ్యక్షుడిగా రవి, ఉపాధ్యక్షుడిగా రవి, ప్రధానకార్యదర్శిగా నాగేశ్తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమం లో ఏఎంసీ డైరెక్టర్ మల్లేశ్, యూత్వింగ్ మండల ప్రధానకార్యదర్శి రవినాయక్, శ్రీకాంత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, మార్చి 13 : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సూచన మేరకు మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్వీ కమిటీలను ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, యూత్ అధ్యక్షుడు వెంకటేశ్ తెలిపారు. కుచ్చర్కల్ గ్రామాధ్యక్షుడిగా రఘునాథ్, ప్రధానకార్యదర్శిగా నరేశ్, కల్లేపల్లి కమిటీ అధ్యక్షుడిగా ఆనంద్, ప్రధానకార్యదర్శిగా నర్సింగ్, పలుగుతండా కమిటీ అధ్యక్షుడిగా గోవింద్, ప్రధానకార్యదర్శిగా సతీశ్, రాయపల్లి కమిటీ అధ్యక్షుడిగా నందీప్, ప్రధానకార్యదర్శిగా వంశీని ఎన్నుకున్నట్లు తెలిపారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, మార్చి 13 : మండలంలోని భైరంపల్లిలో టీఆర్ఎస్వీ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాధ్యక్షుడిగా కొమురయ్య, ప్రధానకార్యదర్శిగా రాజు, ఉపాధ్యక్షుడి శ్రీశైలంతోపాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు పట్నం బంగారు, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు నవీన్ఆచారి మాట్లాడుతూ టీఆర్ఎస్తోనే అన్నివర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పార్టీ బలోపేతానికి నూతన కమిటీల సభ్యులు కృషి చేయాలని సూచించారు.